ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ దంపతులు
తెలంగాణ : ఎంత చదివిన ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న ఒక సామాన్యుడిలా ఉండడం కొంత మంది మహానుభావులకె సాధ్యం.భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తన సతీమణి మాధవికి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించారు. డాక్టర్ దేవికల ఆధ్వర్యంలో మాధవి గారు మగ శిశువుకు జన్మ నిచ్చారు.ఒక జిల్లా కలెక్టర్ గా ఉండి విధులు నిర్వహిస్తూ సామాన్యుడిలా తన సతీమణికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించడం పై ప్రజలు మరియు డాక్టర్లు నాయకులు అభినందనలు తెల్పుతున్నారు. ప్రజలకు విశ్వాసం కలిగించే ఉద్దేశంతోనే కలెక్టర్ కృషి చేసారని తన భార్యను ప్రభుత్వా ఆసుపత్రిలో చేర్పించారని అన్ని వర్గాలకు ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.