- దళిత యువకుడు పై కులం పేరుతో దూషించి తీవ్రంగా రక్త గాయాలు చేసి దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల డిమాండ్
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రం మైల్వార్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పోచమ్మ గుడి దగ్గర కూర్చొని ఉన్న దళిత యువకుడు కృష్ణ పై అదే గ్రామానికి అగ్రకులానికి చెందిన శ్రీకాంత్ శేఖర్ అనే వ్యక్తులు కులం పేరుతో దూషించి తీవ్రంగా రాయితో దాడి చేస్తే తలకు రక్త గాయాలై అయిన ఈరోజు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణను సిఐటియు జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ ప్రజాసంఘాల నాయకులు బస్వరాజ్ మహేష్ అందరూ కలిసి పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు దౌర్జన్యాలు గ్రామాలలో రోజురోజుకు పెరుగుతున్నాయి. దాడులని అరికట్టాల్సిన అధికారులు దాడి చేసిన వారిపై కఠినంగా వ్యవహరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి దాడులు పునరావృతం అవుతున్నాయి. బషీరాబాద్ మండలంలో అనేక రోజులుగా దళితులపై ఏదో ఒక గ్రామంలో దాడులు జరుగుతున్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ఇప్పటికైనా దళిత మహిళ అని చూడకుండా మహిళ పై వారి కొడుకు పై దౌర్జన్యంగా కులం పేరుతో దూషించి దాడి చేసి తీవ్రంగా రక్త గాయాలు చేసిన వారి పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని లేకపోతే దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండలం మాల మహానాడు అధ్యక్షులు బస్వరాజ్ కెవిపిఎస్ అధ్యక్షులు సురేష్ గ్రామ యువకులు భరత్ అంబదాస్ లక్ష్మణ్ వెంకట్ సాయిప్ప శివప్ప కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.