తాండూర్ : దళితుల
సాధికారతే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని గౌరవ ఎమ్మెల్యే పైలెట్
రోహిత్ రెడ్డి గారు అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో బషీరాబాద్ మండలం
ఇందర్చెడ్ గ్రామానికి చెందిన మాల ఎల్లప్ప, మాల బసప్ప, మాల రమేష్ లు
దళిత బంధు పథకం ద్వారా తీసుకున్న కార్ల తాళాలతో పాటు ప్రోసిడింగ్ ఆర్డర్లు వారికి
అందించి శుభాకాంక్షలు తెలిపారు గౌరవ ఎమ్మెల్యే. దళితులు సమాజంలో ఉన్నతంగా ఎదగాలనే
మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో
పాటు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకంజ వేయకుండా లబ్ధిదారులకు లబ్ధి
చేకూరుస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ స్వయం ఉపాధితో భవిష్యత్తులో తన కాళ్ళపై తాను నిలబడి అందరికీ ఆదర్శంగా నిలవాలని తిరుపతయ్య కు ఆల్ ది బెస్ట్ చెప్పారు గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ 60 శాతం సబ్సిడీ కింద తీసుకున్న ఎలక్ట్రిక్ ఆటో తాళంచెవి తో పాటు ప్రోసిడింగ్ ఆర్డర్ను బషీరాబాద్ మండలం దామరచేడ్ గ్రామానికి చెందిన లబ్ధిదారు తిరుపతయ్యకు అందించారు గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు. అనంతరం తిరుపతయ్యకు కంగ్రాట్స్ చెప్పడంతోపాటు స్వశక్తితో కష్టాలను అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.