అసెంబ్లీ ముట్టడి చేసే ప్రయత్నంలో అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడి చేసే ప్రయత్నంలో అరెస్ట్ చేసిన పోలీసులు తెలంగాణ వడ్డెర సంఘం మరియు చారిటబుల్ ట్రస్ట్ ఆదర్యంలో శ్రీ శివరాత్రి ఐల్లా మల్లు గారి ఆదేశాల మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా యూత్ అధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ ఎస్టి సాధనకై ప్రభుత్వం కృషి చేయాలి.ప్రజలు ఉపాధి పని లేక అక్కడ ఇక్కడ వెళ్ళిపోతున్నారు.ప్రభుత్వం కనీసం జాలి కూడా చూపించడం లేదు అని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.