z
భారత్ బియ్యం విక్రయాలు నేటినుంచే కిలోధర 29 రూ. ఢిల్లీలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పియూష్గోయల్
ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. భారత్ రైస్ పేరుతో కిలో రూ.29 చొప్పున 5, 10 కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయి. ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం దిల్లీలోని కర్తవ్య పథ్‌లో విక్రయాలను ప్రారంభిస్తారని అధికారిక ప్రకటన పేర్కొంది. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైస్‌ను విక్రయిస్తారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సరఫరా చేయనుంది. భారత్ రైస్‌ను ఈ-కామర్స్ వేదికలపైనా కొనుగోలు చేయవచ్చు.



.webp)

