కొత్తగాడి బాలికల రెసిడెన్షియల్ హాస్టల్ వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి : వై. గీత డిమాండ్
వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : కొత్తగాడి హాస్టల్ లో 300 మంది విద్యార్థులు అనారోగ్యం పాలు అయితే కూడా అధికారులు స్పందించరా ఈవీఎం మెషిన్లను తనిఖీలు చేసినట్లుగా హాస్టళ్లను ఎందుకు తనిఖీలు చేయట్లేదు ఎలక్షన్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదా కొత్తగాడి బాలికల రెసిడెన్షియల్ హాస్టల్ వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి వై. గీత డిమాండ్ చేస్తూ కొత్తగడి బాలికల రెసిడెన్షియల్ వసతి గృహంలో తరచుగా జరుగుతున్న సంఘటనల పట్ల ఉన్నత అధికారులు ఎందుకు స్పందించడం లేదు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎలక్షన్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద ఎందుకు చూపించడం లేదు. గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్ధి సంఘాలని అణిచివేయాలని వసతి గృహాల్లోకి విద్యార్థి సంఘాలను, ప్రజాసంఘాలను, మీడియాను అనుమతించకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
వసతి గృహాలలో జరిగే అవినీతి అక్రమాలు బయటపడకూడదని ఆంక్షలు పేరుతో తల్లిదండ్రులను, విద్యార్థి సంఘాలను, మీడియాను హాస్టల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. కొత్తగాడి రెసిడెన్షియల్లో కొన్ని రోజుల క్రితం ఒక బాలిక మృతి చెందగా అనారోగ్య కారణాలు చెప్పి తప్పించుకున్న అధికారులు ఇప్పుడు 300 మంది విద్యార్థులు ఒకేసారి జాండీస్ బారిన పడటానికి గల కారణాలేమిటో చెప్పాలి. జిల్లా కలెక్టర్ గారు ఈవీఎం మిషన్లే తనిఖీ చేస్తారా వసతి గృహాల వైపు చూడరా పరీక్షల సమయంలో విద్యార్థుల అనారోగ్యం పాలు అవుతుంటే వారి భవిష్యత్తు ఏమిటి? ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వసతిగృహం తనిఖీ చేయాలి కొత్తగాడి హాస్టల్ వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. లేకుంటే పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నాము.





