Type Here to Get Search Results !

Sports Ad

జూన్ లోనినే రైతు భరోసా ఇవ్వాలే హరీష్ రావు.. Harish Rao should give farmers assurance in June itself..

జూన్ లోనినే రైతు భరోసా ఇవ్వాలే హరీష్ రావు..

* తడిచిన, మొలకెత్తిన వడ్లను కొనాలె
* సన్నవడ్లకే బోనస్ అంటే మోసం చేయడమే
* జూన్లోనే రైతు భరోసా ఇవ్వాలె
* ఎమ్మెల్యే హరీష్ రావు 


సిద్దిపేట Siddipet News భారత్ ప్రతినిధి : జూన్ లోనే ఎకరానికి రూ.7,500 రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు MLA Harish Rao  డిమాండ్ చేశారు.సిద్దిపేట జిల్లా Siddipet Dist చిన్నకోడూరులోని వడ్ల కొను గోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. తరుగు లేకుండా వెంటనే తడిచిన, మొలకెత్తిన వడ్లను వెంటనే కొనాలని డిమాండ్చేశారు. అకాల వర్షాలతో వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు.రైతులు కల్లాల్లో పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం రైస్ మిల్లుకు వెళ్లాక సంచికి మూడు కిలోలు కోతపెడు తున్నారని చెప్పారు. 40% ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉందన్నారు. అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్నవడ్లకే ఇస్తామ నడం రైతులను Farmers మోసం చేయడ మేనని ఫైర్ అయ్యారు. వరిధాన్యానికి బోనస్ అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుట్రతో ఎగ్గొట్టిందన్నారు. పచ్చిరొట్టె విత్తనాలు, సీడ్స్ కోసం పాస్ పుస్తకాలను లైన్ లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మంత్రి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం లేదని విమర్శించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies