మంతన్ గౌడ్ లో మద్యం మత్తులో అంబులెన్సుకు ఫోన్ ... వ్యక్తిపై కేసు
బషీరాబాద్ Basheerabad News భారత్ న్యూస్ ప్రతినిధి : మద్యం మత్తులో ఓ వ్యక్తి 108 అంబులెన్సుకు ఫోన్ చేసిన వ్యక్తిపై బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ గఫార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మంతన్ గౌడ్ గ్రామానికి చెందిన బోయిని బాల్ రాజ్ తన అమ్మ పకిరమ్మ ఆరోగ్యం బాగోలేదంటూ ఉదయం 7 గంటల సమయంలో 108 అంబులెన్సుకు ఫోన్ చేశాడు. అంబులెన్స్ వెంటనే గ్రామానికి చేరుకున్నది. టెక్నీషియన్ సదరు వ్యక్తికి ఫోన్ చేయగా అందుబాటులో లేకపోగా తన తల్లి ఇంట్లో ఉందని తీసుకెళ్లాలని చెబుతుండటంతో చేసేదేమిలేక వెనుదిరిగిపోయారు.అంతలోనే 10:00 గంటల సమయంలో మరోసారి సదరు వ్యక్తి ఫోన్ చేయగా తాండూరు పట్టణం నుంచి మరో అంబులెన్సు గ్రామానికి వచ్చింది. ఆ సమయంలో కూడా అతడు లేకపోవడంతో విసుగెత్తిన అంబులెన్స్ సిబ్బంది ఫోన్ చేసిన వ్యక్తి బషీరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకుని పట్టుకున్నారు. అతడు మద్యం మత్తులో పొంతనలేని మాటలు చెప్పడంతో అంబులెన్స్ డ్రైవర్ కె.రాజు, టెక్నిషియన్ చౌహాన్ సంజు అతడిని పోలీసులకు అప్పగించాడు. అంబులెన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గఫార్ తెలిపారు.





