Type Here to Get Search Results !

Sports Ad

వాసన పీలిస్తే చాలు బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది This Is A Super Technique To lose Weight Just By Inhaling The Smell

వాసన పీలిస్తే చాలు బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది

Health News భారత్ ప్రతినిధి : పిజ్జాలు, బర్గర్లు, షుగర్ ఎక్కువగా ఉండే కుకీస్, స్వీట్లు చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. ఆ ఆహార పదార్ధాలను ఎవరైనా ఇష్టంగానే తింటారు. కానీ వాటిని తింటే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి వాటిని తినడం ఎలా? అందుకు ఓ ఉపాయం ఉంది అంటున్నారు సైంటిస్టులు. ఏంటంటే ఏవి తినాలి అని మీకు అనిపిస్తుందో, వాటి వాసన పీల్చుకోండి. అవును 2 నిమిషాల పాటు అలా ఆ ఆహార పదార్థాల వాసన చూస్తే చాలు మీకు వాటిని తిని కడుపు నిండిన భావన కలుగుతుందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. 

 ఇటీవల, జర్నల్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం సైంటిస్టులు కొందరికి 30 సెకండ్ల పాటు పలు కుకీల వాసన చూపించారు. దీనితో వారికి ఆ కుకీలను తినాలనే ఆసక్తి కలిగింది. తరువాత వారికి 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పాటు పిజ్జాలు, స్ట్రాబెర్రీల వాసన చూపించారు. దీనితో వారికి పిజ్జాల మీద ఆసక్తిపోయి కడుపు నిండిన భావన కలిగింది. అనంతరం వారు స్ట్రాబెర్రీలను తినేందుకు ఆసక్తి చూపించారట. 

 అలాగే పిజ్జాలు, యాపిల్స్ తో మరోసారి టెస్ట్ చేయగా, 2 నిమిషాల అనంతరం వారికి కూడా కడుపు నిండిన భావన కలగడంతో పాటు వారు కూడా పిజ్జాలకు బదులుగా యాపిల్స్ ను తినేందుకు ఆసక్తి చూపించారట. దీని వల్ల సైంటిస్టులు చెప్పేదేంటంటే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలను తినాలనిపిస్తే వాటి వాసన 2 నిమిషాల పాటు చూస్తే చాలు. ఇక ఆ ఆహారాలను తినాలనే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీనిద్వారా అధిక బరువు, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies