హైదరాబాద్ లో దంచి కొట్టిన వర్షం తెలంగాణలో పిడుగులు పడే అవకాశం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. ఏప్రిల్ 3న మధాహ్నం 2 గంటలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం నుంచి నగర వ్యాప్తంగా ఎండ దంచికొట్టిన సంగతి తెలిసిందే.
ఉన్నట్టుం ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏప్రిల్ 3 న భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మెహిదీపట్నం, లక్డీకాపూల్, బేగంపేట్, హుస్సేన్ సాగర్, సికింద్రాబాద్, తార్నాక, ఎల్‌బీనగర్, హబ్సిగూడతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.