Type Here to Get Search Results !

Sports Ad

WTC ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ గెలిచిన జట్టుకు జాక్ పాటే ICC Announces WTC Prize Money, Jack Patt For Winning Team

WTC ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ గెలిచిన జట్టుకు జాక్ పాటే

Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2023-25 ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ మేరకు ఐసీసీ చైర్మన్ జైషా గురువారం (మే 15) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డబ్ల్యూటీసీ ఫ్రైజ్ మనీ వివరాలను వెల్లడించారు. ఐసీసీ మొత్తం 5.76 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ. 49.32 కోట్లు) నగదు బహుమతిని అనౌన్స్ చేసింది. ఇందులో డబ్ల్యూటీసీ విజేతగా నిలిచే జట్టుకు 30.78 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుండగా రన్నరప్‎కు 18.46 కోట్లు రూపాయల బహుమతి లభించనుంది.

 డబ్ల్యూటీసీలో మూడో స్థానంతో సరిపెట్టుకున్న టీమిండియాకు 12.33 కోట్లు దక్కనున్నాయి. కాగా, 2023-25 ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11న మొదలు కానుంది. ఇంగ్లాండ్‎లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా, -సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. కాగా, డబ్ల్యూటీసీ తొలి రెండు ఎడిషన్లలో టీమిండియా ఫైనల్‎కు చేరుకున్న విషయం తెలిసిందే. 

 ఫస్ట్ ఎడిషన్‎లో తుదిపోరులో కంగారుల చేతిలో ఓటమి పాలు కాగా రెండో సీజన్‎లో ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. మూడో ఎడిషన్ల కనీసం ఫైనల్‎కు కూడా చేరుకోలేక మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. 2025, జూన్ నెలలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్, ఇండియా టెస్ట్ సిరీస్‎తో డబ్ల్యూటీసీ ఫోర్త్ ఎడిషన్ మొదలు కానుంది. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies