Type Here to Get Search Results !

Sports Ad

140 ఏళ్ల కల నెరవేరింది కాశ్మీర్-కన్యాకుమారి రైలు మార్గం కనెక్టివిటీ 140-year-old dream fulfilled: Kashmir-Kanyakumari rail connectivity

140 ఏళ్ల కల నెరవేరింది కాశ్మీర్-కన్యాకుమారి రైలు మార్గం కనెక్టివిటీ

జాతీయ National News భారత్ ప్రతినిధి : భారతీయుల140 యేళ్ల కల జమ్మూకాశ్మీర్ డోగ్రా రాజు మహారాజా ప్రతాప్ సింగ్ తలపెట్టిన లక్ష్యం ఉధంపూర్-బారాముల్లా-శ్రీనగర్ రైలు లింక్ , చీనాబ్ వంతెన, అజ్నీవంతెన ప్రారంభంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రత్యక్ష రైలు ప్రయాణం కల సాకారమయింది. లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ఆటకం లేకుండా ఒకే రైలు ప్రయాణంతో భారత దేశం మొత్తం చుట్టిరావచ్చు. 

 చీనాబ్ ,అంజి ఖాడ్ వంతెనలను శుక్రవారం (2025, జూన్ 6న)ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ రెండు వంతెనలు జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టులో కీలక భాగాలు. చీనాబ్ ,అంజి ఖాడ్ వంతెనల ప్రారంభంతో  చాలా కాలంగా ఒంటరిగా ఉన్న కాశ్మీర్ రైలు మార్గం చివరకు భారతదేశ జాతీయ రైల్వే నెట్‌వర్క్‌లో విలీనం అయింది. దీంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రత్యక్ష రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.

 ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని..తమ ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. "మంచి పనులన్నీ నాకే మిగిలి ఉన్నాయని" ఆయన చమత్కరించారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేయడంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మికులు ,అధికారులతో ప్రధాని మోదీ ముచ్చటించి వారి కృషిని ప్రశంసించారు.
పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించారు. ఈ వంతెన నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్లు ఎక్కువ. దీని మొత్తం పొడవు 1,315 మీటర్లు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies