పెళ్లి బరాత్లో నాగ్ పూనకాలు చైతన్య, అఖిల్తో కలిసి ధూం ధామ్ చిందులు వీడియోలు వైరల్
సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : అక్కినేని నాగార్జున చిన్నకొడుకు అఖిల్ పెళ్లి వైభవంగా జరిగింది. శుక్రవారం (జూన్6న) తెల్లవారుజామున 3 గంటలకు తన ప్రియురాలు జైనాబ్ రవ్జీని అఖిల్ పెళ్లాడారు. ఈ సందర్భంగా అక్కినేని వారి వివాహ వేడుకకు సినీ సెలెబ్రెటీలు పెద్దఎత్తున హాజరయ్యారు.
వారిలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, శర్వానంద్, దర్శక ధీరుడు రాజమౌళి, అతడి కుమారుడు కార్తికేయ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ సహా తదితరులు హజరై సందడి చేశారు.
ఈ క్రమంలో పెళ్లి అనంతరం జరిగిన బరాత్లో అక్కినేని కుటుంబం ఆనందంగా చిందులేసింది. ఓ వీడియోలో పెళ్ళికొడుకు అఖిల్ తన తండ్రి నాగార్జున, అన్న నాగచైతన్యతో కలసి హుషారుగా డ్యాన్స్ చేశాడు.
ఇంకా చెప్పాలంటే పోయిన సంతోషం మళ్ళీ తిరిగొచ్చిందనేలా అక్కినేని ఫ్యామిలీ డ్యాన్స్ చేశారు. అది వారి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నాగార్జున ఆనందం ఐతే మరోలెవల్ అన్నట్టుగా డ్యాన్స్ ఇరగదీశాడు. ఫర్ ది కిల్ అనే క్యాప్షన్తో బరాత్ డీజేలు మోత మోగేలా డ్యాన్స్ కుమ్మేశాడు.