Type Here to Get Search Results !

Sports Ad

ఈ ఏడాది దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే స్కూల్స్ క్యాలెండర్ విడుదల This year's Dussehra, Christmas, and Sankranti holidays: These are the schools' calendar releases

ఈ ఏడాది దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే స్కూల్స్ క్యాలెండర్ విడుదల

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం గురువారం (June 12) నుంచి ప్రారంభం కానున్నది. స్కూల్ ఎడ్యుకేషన్ 2025–26 అకడమిక్ క్యాలెండర్‌ ను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 12 నుంచి క్లాసులు ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 23న లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటించారు. 

 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ  యోగితారాణా ఉత్తర్వులు జారీచేశారు. 2025–26 విద్యాసంవత్సరం మొత్తం230 పనిదినాలు ఉంటాయి. కాగా, ఇప్పటికే శుక్రవారం ప్రారంభమైన బడిబాట ప్రోగ్రామ్ ఈ నెల 19 వరకు కొనసాగనున్నది. 

 ఎస్ఏ1 పరీక్షలు అక్టోబర్ 24 నుంచి 31 వరకు, ఎస్ఏ2 ఎగ్జామ్స్ ఏప్రిల్ 10 నుంచి 18 వరకు ఉంటాయి. టెన్త్ ప్రీఫైనల్ ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని, మార్చిలో పబ్లిక్ పరీక్షలు ఉంటాయని షెడ్యూల్​ లో పేర్కొన్నారు.  ప్రతినెలా మొదటివారంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ) సమావేశాలు, ప్రతి నెలా మూడో శనివారం నో బ్యాగ్ డే నిర్వహించనున్నారు. 

హాలీడేస్...
దసరా: సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు 
క్రిస్మస్ (మిషనరీ స్కూళ్లు): డిసెంబర్ 23, 2025 నుంచి డిసెంబర్ 27 వరకు
సంక్రాంతి: జనవరి 11 నుంచి 15 వరకు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies