ఆపిల్ కొత్త ఐఫోన్ 17 లాంచ్ తేదీ, కలర్స్, ఫీచర్స్, ధర ఇండియాలో ఎంతంటే
Technology News సాంకేతిక వార్తలు భారత్ ప్రతినిధి : ప్రతి ఏడాది ఆపిల్ కంపెనీ ఒక కొత్త ఐఫోన్ లాంచ్ చేస్తుందని మీకు తెలిసే ఉంటుంది. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్లో కొత్త ఐఫోన్ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఈ కొత్త ఐఫోన్ సంబంధించి ఇప్పటికే అంచనాలు, పుకార్లు భారీగా వినిపిస్తున్నాయి. దీనికితోడు సోషల్ మీడియాలో కూడా కొన్ని రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి.
ఆపిల్ నుండి రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐఫోన్ 17 ప్రో మాక్స్. దీనిని సెప్టెంబర్ 2025లో విడుదల చేయనున్నట్లు సమాచారం. డిజైన్ మార్పుల నుండి పవర్ ఫుల్ హార్డ్‌వేర్, పెద్ద కెమెరా అప్‌గ్రేడ్స్ వరకు, ఈ ఫోన్ కంపెనీ అత్యంత గొప్ప అనుభూతిని ఇచ్చే ఐఫోన్ కావచ్చు. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో పాటు ఈ కుపెర్టినో కంపెనీ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17ప్రోలను సెప్టెంబర్ 11 నుండి 13 నాటికి ప్రకటిస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ దీని ధర నుండి స్పెసిఫికేషన్ల వరకు మీరు ఎం ఆశించొచ్చో అంటే.
ఇండియా, దుబాయ్, యుఎస్ఎలో దీని ధర : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ 11 నుండి 13 మధ్య వెలువడే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర భారతదేశంలో రూ.1,64,900 కాగా, అమెరికాలో $2,300 అంటే రూ.1,97,770, దుబాయ్‌లో AED 5,399 అంటే రూ.1,26,383గా ఉండే అవకాశం ఉంది.
కలర్ ఆప్షన్స్ చూస్తే : ఈ సంవత్సరం ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఐదు కలర్ అప్షన్స్ రావచ్చు. స్కై బ్లూ , వైట్, సిల్వర్, గోల్డ్ ఇంకా బ్లాక్.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫీచర్స్ : ఐఫోన్ 17 ప్రో మాక్స్ పెద్ద 6.9-అంగుళాల డిస్‌ప్లేతో ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఆపిల్ టైటానియం నుండి కొత్త అల్యూమినియం-గ్లాస్ హైబ్రిడ్ బ్యాక్‌కి మారుతున్నట్లు సమాచారం. ఇది ఫోన్‌ను తేలికగా చేయడమే కాకుండా వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా బెటర్ చేస్తుంది . అలాగే 8.725mm మందంతో పెద్ద బ్యాటరీ అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
బ్యాక్ కెమెరా లేఅవుట్‌లో మరో మార్పు కూడా రాబోతోంది. ఆపిల్ ఇంతకుముందు కంటే వెడల్పుగా మూడు లెన్స్‌లతో కెమెరాను ప్రవేశపెట్టవచ్చు. ఐఫోన్ 17 ప్రో మాక్స్ 3nm ప్రాసెస్‌పై నిర్మించిన ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ A19 ప్రో చిప్ ద్వారా రన్ అవుతూంది. RAM 8GB నుండి 12GBకి పెంచొచ్చు. ఫోన్ వేడెక్కకుండా మంచి కూలింగ్ సిస్టం కుడి అందించనుంది.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ కెమెరా: కెమెరా విషయానికి వస్తే, ఆపిల్ పూర్తిగా అప్ గ్రేడ్ చేయబోతుంది. ముందు కెమెరా 24MPకి పెరగవచ్చు. వెనుక భాగంలో మూడు 48MP సెన్సార్లు ఉంటాయి వైడ్, అల్ట్రా-వైడ్, జూమ్ ఇంకా పోర్ట్రెయిట్‌ల కోసం 3.5x టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంటుంది. కొత్త ఫీచర్లలో 8K వీడియో రికార్డింగ్, డ్యూయల్-వీడియో మోడ్ ఉండోచ్చు.
మందమైన డిజైన్ 7.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వవచ్చు. ఈ ఫోన్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ (Qi 2.2), 35W వైర్డ్ ఛార్జింగ్ కూడా తెస్తుంది. కనెక్టివిటీ అప్‌గ్రేడ్‌లలో Wi-Fi 7 (ఆపిల్ సొంత చిప్‌తో), బ్లూటూత్ 5.3 ఉన్నాయి.