Type Here to Get Search Results !

Sports Ad

800 గ్రాముల గోల్డ్, రూ.70 లక్షల వోల్వో కార్ ఇచ్చారు అయినా కట్నం కోసం చంపేశారు They were given 800 grams of gold and a Volvo car worth Rs. 70 lakh, but they killed him for dowry.

800 గ్రాముల గోల్డ్, రూ.70 లక్షల వోల్వో కార్ ఇచ్చారు అయినా కట్నం కోసం చంపేశారు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పెళ్లి అంటే కొందరు తోడు కోసం వందేళ్లు బతికేందుకు చేసుకుంటే మరికొందరు డబ్బు, బంగారం, కట్నం కోసమే చేసుకుంటారేమో అని ఇలాంటి ఘటన చూస్తే అనిపిస్తుంది. వరకట్న నిశేధ చట్టం  వచ్చి 60 ఏళ్లు పూర్తయినా అరాచకాలు మాత్రం ఆగటం లేదు. అదీ చదువుకున్న వాళ్లు బాగా ఆస్తి, ఐశ్యర్యంతో సెటిల్ అయినవాళ్లు కట్నం కోసం వేధించి చంపేస్తుండటం ఆందోళన కలిగించే అశం.

 తమిళనాడులో అలాంటి ఘటనే జరిగింది. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అబ్బాయికి మంచి ఉద్యోగం అయితేనేం తమ తాహతుకు తగినంత ఇచ్చుకోవాల్సిందే అనే డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించి భారీగా కట్న కానుకలు ఇచ్చారు. అయినా మరింత కావాలని వేధింపులు చేయడంతో మానసికంగా కృంగి పోయిన నవవధువు సూసైడ్ చేసుకుని చనిపోయింది. 

 తమిళనాడు తిరుప్పూర్ లో 27 ఏండ్ల రాధన్య అనే నవవధువు మృతి చెందడం కలకలం రేపింది. బట్టల కంపెనీ ఓనర్ అయిన అన్నాదురై కూతురు రాధన్య ను 2025, ఏప్రిల్ లో కవిన్ కుమార్ (28) అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లిలో ఒప్పందాల ప్రకారం 800 గ్రాముల బంగారు నగలు, 70 లక్షల విలువ చేసే వోల్వో కార్ కానుకగా ఇచ్చారు. 

 ఆదివారం (జూన్ 29), మొండిపాల్యంలోని గుడికి వెళ్తున్నానని చెప్పి రాధన్య బయటకు వెళ్లింది. మార్గ మధ్యలో కారు ఆపేసి పురుగు మందు ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది. కార్ పార్క్ చేసి ఉండటాన్ని పోలీసులు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కారులో రాధన్య పొగమందు మాత్రలు మింగి చనిపోయినట్లు గుర్తించారు. 

 చనిపోయే ముందు ఆమె తన తండ్రికి ఏడు వాయిస్ మెసేజెస్ పెట్టినట్లు తెలుస్తోంది. భర్త, అత్తమామల టార్చర్ తట్టుకోలేక పోతున్నానని ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు క్షమించాలని తండ్రిని మెసేజ్ ద్వారా వేడుకుంది. 

 వాళ్ల టార్చర్ తట్టుకోలేక పోతున్న ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. ఎవరికైనా చెప్పుకున్నా జీవితంలో ఇలాంటి కష్టాలు కామన్. భరించాలి అంటున్నారు కానీ నా సమస్యను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు’’ అని ఆవేదనతో చెప్పుకుంది. 

‘‘నా చుట్టూ ఉన్నవాళ్లు నటిస్తున్నారు. నేను అబద్ధం ఆడుతున్నట్లు అనుకుంటున్నారు. నేనెందుకు ఇంత సైలెంట్ అయిపోయానో ఎవరూ అర్థం చేసుకోవటం లేదు’’ అని చెప్పింది. నా లైఫ్ లో ఇంత టార్చర్ భరించలేక పోతున్న. అత్తమామలు మెంటల్ గా టార్చర్ చేస్తుంటే భర్త ఫిజికల్ గా టార్చర్ చేస్తున్నాడు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నేనే బతకలేను’’ అని మెస్సేజ్ పెట్టింది. 

 నాన్న, నువ్వు, అమ్మే నాకు ప్రపంచం. నా చివరి శ్వాస వరకు మీ మీదే ఆశ. కానీ మిమ్మల్ని బాధపెట్టాను’’ అంటూ చనిపోయే ముందు మెసేజ్ పెట్టింది రాధన్య. ఆమె బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త కవిన్ కుమార్, అత్తా మామలు ఈశ్వరమూర్తి, చిత్రాదేవిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies