మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు హైదరాబాదులో గురువారం రేట్లివే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గ్లోబల్ మార్కెట్లలో బంగారానికి గిరాకీ తగ్గుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా ఇప్పటి వరకు బంగారం ధరలు సామాన్యులకు అనుకూలంగా తగ్గుముఖం పట్టాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాపర్ టారిఫ్స్, ఫార్మా టారిఫ్స్, బ్రెజిల్ పై సుంకాల ప్రకటన తర్వాత కొద్దిగా మళ్లీ పసిడి ధరలు పెరుగుదల స్టార్ట్ అయ్యింది. దీంతో ఇవాళ రిటైల్ గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేలు పెరుగుదులను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో రూ.9వేల 020, ముంబైలో రూ.9వేల 020, ఢిల్లీలో రూ.9వేల 035, కలకత్తాలో రూ.9వేల 020, బెంగళూరులో రూ.9వేల 020, కేరళలో రూ.9వేల 020, పూణేలో రూ.9వేల 020, వడోదరలో రూ.9వేల 025, జైపూరులో రూ.9వేల 035, లక్నోలో రూ.9వేల 035, మంగళూరులో రూ.9వేల 020, నాశిక్ లో రూ.9వేల 023, అయోధ్యలో రూ.9వేల 035, బళ్లారిలో రూ.9వేల 020, గురుగ్రాములో రూ.9వేల 035, నోయిడాలో రూ.9వేల 035గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2వేల 200 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో రూ.9వేల 840, ముంబైలో రూ.9వేల 840, ఢిల్లీలో రూ.9వేల 855, కలకత్తాలో రూ.9వేల 840, బెంగళూరులో రూ.9వేల 840, కేరళలో రూ.9వేల 840, పూణేలో రూ.9వేల 840, వడోదరలో రూ.9వేల 845, జైపూరులో రూ.9వేల 855, లక్నోలో రూ.9వేల 855, మంగళూరులో రూ.9వేల 840, నాశిక్ లో రూ.9వేల 843, అయోధ్యలో రూ.9వేల 855, బళ్లారిలో రూ.9వేల 840, గురుగ్రాములో రూ.9వేల 855, నోయిడాలో రూ.9వేల 855 వద్ద ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 200 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.98వేల 400గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 20వేల వద్ద ఉంది.