పదో తరగతి పాసై పల్లెల్లో ఉంటున్న మహిళలకు శుభవార్త
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పల్లెటూళ్లలో బీమా సఖి యోజనను మరింత మందికి చేరువ చేయడానికి ఎల్ఐసీ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని గ్రామీణాభివృద్ధి శాఖతో (డీఓఆర్డీ) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. గ్రామీణ మహిళలకు బీమా సేవలను అందించడం, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, వారికి ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ ఒప్పందం లక్ష్యం. బీమా సఖి యోజనను మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
పదో తరగతి పాసై, 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలకు బీమా ఏజెంట్లుగా శిక్షణ ఇస్తారు. మొదటి మూడు సంవత్సరాలు స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని, మహిళలకు దీర్ఘకాలిక ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించాలని ఎల్ఐసీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భావిస్తున్నాయి.