Type Here to Get Search Results !

Sports Ad

17 ఏళ్ళ కెరీర్‌లో తొలిసారి: డకౌటైనా కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్ చప్పట్లతో మారు మ్రోగిన అడిలైడ్ స్టేడియం For the first time in his 17-year career: Dhawan and Kohli receive a standing ovation as the Adelaide Stadium erupts in applause


 క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు.  ఏడు నెలల తర్వాత తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ తడబడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి వన్డేలో డకౌటైనా విరాట్.. ప్రస్తుతం అడిలైడ్ లో జరుగుతున్న రెండో వన్డేలోనూ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరుకున్నాడు. తనకు అచొచ్చిన గ్రౌండ్ లో కోహ్లీ పరుగుల వరద పారిస్తాడనుకున్న ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఐదో బంతికి బార్ట్ లెట్ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగ్ ధాటికి ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. 

 పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 బంతుల్లో డకౌటైన కోహ్లీ.. అడిలైడ్ వన్డేల్లో నాలుగు బంతుల్లో సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఔటై నిరాశగా వెళ్తున్న కోహ్లీకి అడిలైడ్ ఫ్యాన్స్ చప్పట్లతో గౌరవించారు. బ్యాట్ పట్టుకొని తలవంచుకొని వెళ్తుంటే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి  చప్పట్లతో కోహ్లీ నామస్మరణ చేయడం విశేషం. అడిలైడ్ గ్రౌండ్ లో కోహ్లీకి అత్యద్భుతమైన రికార్డ్ ఉంది. ఫార్మాట్ ఏదైనా ఈ స్టేడియంలో కోహ్లీ ఒకప్పుడు పరుగుల వరద పారించేవాడు. తన ఫేవరేట్ గ్రౌండ్ లో విరాట్ డకౌట్ కావడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. 304 మ్యాచ్ ల వన్డే కెరీర్ లో కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్ ల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి.

 ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి వన్డే మాదిరి రెండో వన్డేలో కూడా టీమిండియా బ్యాటింగ్ లో తడబడుతుంది.  కు ఘోరమైన ఆరంభం లభించింది. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శుభమాన్ గిల్ 9 పరుగులే చేసి విఫలం కాగా.. కోహ్లీ డకౌటయ్యాడు. ఈ రెండు వికెట్లు ఇన్నింగ్స్  ఏడో ఓవర్లో బార్ట్ లెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఇండియా తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజ్ లో రోహిత్ శర్మ (19), శ్రేయాస్ అయ్యర్ (0) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బార్ట్ లెట్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies