Type Here to Get Search Results !

Sports Ad

20 మందిని బలి తీసుకున్న బస్సు యాక్సిడెంట్ ముందు తర్వాత ఓవర్ స్పీడ్ పై రూ.23 వేల చలాన్లు Rs. 23 thousand challans issued for overspeeding before and after bus accident that killed 20 people


తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : హైదరాబాద్ సిటీ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి బయలుదేరిన ఈ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికుల వరకు చనిపోయారు. విశేషం ఏంటీ అంటే అసలు ఈ బస్సు రిజిస్ట్రేషన్ అయ్యింది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రాయగఢ్ ఒరిస్సా రాష్ట్రంలో రిజిస్టర్ అయ్యింది అని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. 

 ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు నెంబర్ DD01N9490 DD అంటే డామన్ డయ్యూ కింద ఉంది. బస్సు ఫిట్‌నెస్, పర్మిట్ ఉంది. ఈ లైసెన్స్, పర్మిట్ కు సంబంధించిన అంశాలు ఒడిశా రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. బస్సు పర్మీట్ అంతా ఒడిశాలో ఉంది. తిరుగుతున్నది మాత్రం మూడు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి కర్నాటక రాష్ట్రం వెళుతుంది మార్గమధ్యంలో ఏపీలో యాక్సిడెంట్ అయ్యింది. మొత్తానికి వేమూరి కావేరి ట్రావెల్ బస్సు యాక్సిడెంట్ వల్ల ట్రావెల్ బస్సులు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది స్పష్టం అవుతుంది. 

 మరో విషయం ఏంటంటే DD01N9490 నెంబర్ బస్సు యాక్సిడెంట్ ముందు యాక్సిడెంట్ తర్వాత ఎలా ఉంది పైన ఫొటో స్పష్టం చేస్తుంది. ఈ బస్సుపై తెలంగాణలో 23 వేల రూపాయల ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్లు అన్నీ ఓవర్ స్పీడ్ కారణంగా పడినవే.  అంటే ఈ బస్సు ఓవర్ స్పీడ్ అనేది చాలా కామన్ గా కనిపిస్తుంది ట్రాఫిక్ పోలీసుల చలాన్లు చూస్తుంటే ఈ ఓవర్ స్పీడ్ వల్లే ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యిందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. 

 వేమూరి కావేరీ లగ్జరీ బస్సు ఘోర ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రాకు చెందిన వారు ఉన్నారు. వీళ్లందరూ హైదరాబాద్ సిటీ నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను ఢీకొట్టిన తర్వాత చెలరేగిన మంటలతో బస్సు మొత్తం కాలి బూడిద అయ్యింది. ప్రయాణికులు సజీవ సమాధి అయ్యారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies