Type Here to Get Search Results !

Sports Ad

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ సిలబస్ మారింది, పాస్ మార్కులు కూడా మారాయి Alert syllabus for Inter students has changed, pass marks have also changed

ఆంధ్ర ప్రదేశ్ వార్తలు భారత్ ప్రతినిధి : ఇంటర్ విద్యావిధానంలో కీలక మార్పులు చేపట్టింది ఏపీ ఇంటర్ బోర్డు. 12 ఏళ్ళ తర్వాత సైన్స్ కోర్సు సిలబస్ లో మార్పులు చేపట్టింది బోర్డు. మొదటి సంవత్సరంలోనే లాబ్స్, ప్రాక్టికల్స్ నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలు, 80 మార్కులకు ఎక్స్టర్నల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం రెండు పాపేర్లుగా ఉన్న మ్యాథ్స్ 1A , 1Bలను ఒకే సబ్జెక్టుగా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 

 గతంలో ఒక్కో పేపర్ కు గాను 75 మార్కులు ఉండగా ఇప్పుడు 100 మార్కులకు మార్చింది. గతంలో పాస్ మార్కులు 25గా ఉండగా కొత్త విధానం ప్రకారం పాస్ మార్కులు 35గా ఉండనున్నాయి. ఇక బైపీసీ విషయానికి వస్తే బోటనీ, జువాలజీ సబ్జక్ట్స్ ని కలిపి బయాలజీగా మార్చింది ప్రభుత్వం.

 కొత్త విద్యావిధానం ప్రకారం బైపీసీ ఫస్ట్ ఇయర్ లో 85 మార్కులకే పరీక్షలు జరగనున్నాయి. పాస్ మార్కులు 29గా ఉండనున్నాయి. ఇక సెకండ్ ఇయర్లో పాస్ మార్కులు 30గా ఉండనున్నాయి.హ్యుమానిటీస్‌ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్‌ సిలబస్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఇంటర్‌ బోర్డు.అకౌంటెన్సీ, కామర్స్‌, ఎకనామిక్స్‌ లతో ఏసీఈ కోర్సు ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.

పాస్ మార్కుల్లో మార్పు:
ప్రస్తుతం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జక్ట్స్ లో రెండు సంవత్సరాలకు కలిపి 59.50 మార్కులు రావాల్సి ఉండగా కొత్త రూల్స్ ప్రకారం 59 మార్కులకు తగ్గించింది ప్రభుత్వం. దీన్ని బట్టి హాఫ్ మార్కు తక్కువ వచ్చినా పాస్ అయినట్లే పరిగణిస్తారు. ఈ క్రమంలో ప్రాక్టికల్స్ లో పాస్ మార్కులు 10.5 నుంచి 11 మార్కులకు పెరిగాయి.

 NCERT విధానం ప్రకారం ఈ మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపింది ప్రభుత్వం. కూటమి సర్కార్ తాజా నిర్ణయం ఇంటర్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొత్త రూల్స్ వల్ల ఇకమీదట అర మార్కు తక్కువ వచ్చినా ఫెయిల్ అవుతామేమో అన్న టెన్షన్ నుంచి స్టూడెంట్స్ కి రిలీఫ్ లభించినట్లే అని చెప్పాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies