Type Here to Get Search Results !

Sports Ad

పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మళ్లీ బాంబు దాడి బలూచిస్తాన్‌లో భయాందోళనలు Another bomb attack on Zafar Express in Pakistan, panic in Balochistan


తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మంగళవారం సింధ్-బలూచిస్తాన్ సరిహద్దు సుల్తాన్ కోట్ ప్రాంతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై భారీ బాంబు దాడి జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ట్రాక్ మీద పెట్టిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్(IED) పేలటంతో ప్రమాదం చోటుచేసుకుంది. 

 ఈ పేలుడు కారణంగా రైలులోని నాలుగు నుంచి ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. క్విట్టాకు వెళుతున్న ఈ ప్రయాణికుల రైలుపై కొన్ని నెలల కిందట ఆగస్టులో కూడా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రమాదంలో గాయపడ్డ వారికి వెంటనే చికిత్స అందించేందుకు రక్షణ సిబ్బంది, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాంబు పేలుడు వల్ల ఎవరైనా మరణించారా అనే వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. 

 ఘటన జరిగిన ప్రదేశాన్ని సెక్యురిటీ సిబ్బంది సెక్యూర్ చేసి.. మరిన్ని పేలుళ్ల కోసం ఏవైనా బాంబులు ఇంకా ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. రైల్వే సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, రవాణా మార్గాన్ని తిరిగి సురక్షితంగా తెరవడానికి చర్యలు కొనసాగుతున్నాయి. 

గతంలో జరిగిన దాడులు...
జాఫర్ ఎక్స్‌ప్రెస్ పై బాంబు దాడులు ఇదే మెుదటిది కాదు. గతంలో పంజాబ్, బాలోచిస్తాన్ సరిహద్దుల్లో దాదాపు ఈ ఏడాది అనేక దాడులు జరిగాయి. ఆగస్టులో మస్తుంగ్ జిల్లాలో కూడా IED పేలుడు వల్ల ఆరు కోచీలు ట్రాక్ నుంచి అదుపుతప్పాయి. మార్చిలో బాలోచ్ లిబరేషన్ ఆర్మీ రైలులోని 400 మందికి పైగా ప్యాసింజర్లను బంధీలుగా తీసుకున్నారు. పాక్ నుంచి తాము విడిపోతామని బలూచ్ ప్రజలు చేస్తున్న తిరుగుబాటుతో తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పాక్ సైన్యంపై కూడా వరుస దాడులు నమోదవుతూనే ఉన్నాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies