Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : ప్రదీప్ రంగనాథన్ హీరోగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మూవీ ‘డ్యూడ్’ (Dude). దీపావళి కానుకగా ఈనెల 17న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ డ్యూడ్ ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే వచ్చిన ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది. కామెడీతో పాటు ఎమోషన్స్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. డైలాగ్స్ యూత్కి మంచి బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయి. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
మమిత బైజు, టిల్లు ఫేమ్ నేహా శెట్టితో ప్రదీప్ కెమిస్ట్రీ, లవ్, ఎమోషన్ సీన్స్.. డ్యూడ్ పై సస్పెన్స్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. వీరిమధ్య అసలేం జరిగిందనే ఆసక్తి, ఆడియన్స్లో కలిగేలా చేశారు మేకర్స్.
ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 17న డ్యూడ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ దీపావళికి తెలుగులో మిత్రమండలి, తెలుసు కదా, కె ర్యాంప్ మూవీస్ వస్తున్నాయి. ఈ క్రేజీ సినిమాలకి డ్యూడ్ ఎలాంటి పోటీ ఇవ్వనుందో అనే ఆసక్తి నెలకొంది.