Type Here to Get Search Results !

Sports Ad

LIC కొత్త స్కిం ఇన్వెస్ట్ చేస్తే చాలు నెలకు రూ.9750 వడ్డీ డైరెక్ట్ మీ అకౌంట్లోకే Just invest in LIC's new scheme and get Rs. 9750 interest per month directly in your account.


 భారత్ ప్రతినిధి : ఎవరైనా కష్టపడి సంపాదించిన డబ్బును వడ్డీ వచ్చే చోట లేదా సేఫ్ గా ఉండే చోట ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. ఇందులో  బాగా ఎక్కువగా నమ్మకమైన వాటిలో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఒకటి. కానీ  బ్యాంకులలాగానే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా పెట్టుబడిదారులకు మంచి రాబడి ఇచ్చే నమ్మకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ఇస్తోంది.

 LIC FD పథకంలో  లక్షన్నర పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందో  తెలుసా: LIC అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  ఇండియాలోనే అతిపెద్ద జీవిత బీమా (life insurance) సంస్థ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చెందినది. LIC జీవిత బీమా సేవలను అందిస్తుంది. 

 జీవిత బీమా పాలసీలతో పాటు LIC పెన్షన్ ప్లాన్‌లు, హెల్త్ ఇన్సూరెన్స్, పెట్టుబడి పథకాలను కూడా ఇస్తుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారులలో ఒకటి. అయితే ఈ LIC ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం చాలా సురక్షితమైనది అండ్ ప్రతినెల నెల  డబ్బు సంపాదించడానికి అవకాశం ఇస్తుంది. పెట్టుబడి నుండి వచ్చే వడ్డీ ప్రతి నెలా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో  పడుతుంది. 

LIC FD స్కిం వివరాలు: LIC ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) ద్వారా ఇస్తుంది.  LIC FD పథకాలపై ప్రస్తుతం వడ్డీ రేటు సంవత్సరానికి 6.45% వరకు ఉంటుంది. సీనియర్ సిటిజన్లు 0.25% ఎక్కువ వడ్డీ రేటు కూడా  పొందవచ్చు. ప్రత్యేక సందర్భాలలో మొత్తం వడ్డీ 7% లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. ఈ పథకంలో నెల నెల వడ్డీ వస్తుంది. ప్రతినెల రెగ్యులర్ ఆదాయం కోరుకునే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

ఉదాహరణకు: మీరు 7.8% ఏడాది వడ్డీ రేటుతో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు నెలకు సుమారు రూ.6,500 వడ్డీ వస్తుంది. అంటే ఏడాదికి  మొత్తం వడ్డీ దాదాపు రూ.97,500.

 మీరు రూ.1 లక్ష 50 వేలు పెట్టుబడి పెడితే వడ్డీ రేటును బట్టి నెలకు వడ్డీ ఆదాయం రూ.530 నుండి రూ.950 వరకు ఉంటుంది. కానీ LIC FD పథకంలో కనీస పెట్టుబడి మొత్తం రూ.1 లక్ష 50 వేలు. కాలపరిమితి 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వరకు ఉండవచ్చు. గరిష్టంగా  ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు, పరిమితి లేదు.

 మీరు 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెడితే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు (టాక్స్ డిడక్షన్) క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా సంవత్సరపు వడ్డీ ఆదాయం రూ.40 వేలు మించకపోతే టాక్స్ కట్ కాకుండా ఉండడానికి మీరు ఫారం 15G లేదా ఫారం 15Hని సబ్మిట్ చెయ్యొచ్చు. 

 అంతేకాదు LIC FDపై లోన్  కూడా తీసుకోవచ్చు. డిపాజిట్ చేసిన తేదీ నుండి 6 నెలల తర్వాత కావాలనుకుంటే ముందుగానే  మీ డబ్బు తీసుకోవచ్చు. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై తక్కువ వడ్డీ రేటుకే లోన్‌ పొందవచ్చు. భవిష్యత్తులో డబ్బు అవసరమయ్యే వారికి ఇది చాలా మంచి ఆప్షన్. మార్కెట్ రిస్క్‌లు తీసుకోకుండా లాభాలు సంపాదించాలనుకునే వారికీ LIC FD పథకం చాలా సురక్షితమైనది.  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies