Type Here to Get Search Results !

Sports Ad

స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో భారీగా ఉద్యోగాలు ఎగ్జామ్ లేదు టెన్త్, ఇంటర్ పాసైతే చాలు There are huge jobs in the railways under the sports quota. There is no exam. Passing 10th and Inter is enough.

భారత్ ప్రతినిధి : రైల్వే రిక్రూట్​మెంట్ సెల్(RRC) సికింద్రాబాద్ దక్షిణమధ్య రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 14.

పోస్టుల సంఖ్య: 61

పోస్టులు : ఎస్​సీఆర్, హెడ్​క్వార్టర్స్, సికింద్రాబాద్ కోటా 21, హెడ్​క్వార్టర్స్ కోటా 10, సికింద్రాబాద్ డివిజన్ 05, హైదరాబాద్ డివిజన్ 05, విజయవాడ డివిజన్ 05, గుంతకల్ డివిజన్ 05, గుంటూరు డివిజన్ 05, నాందేడ్ డివిజన్ 05. 

ఎలిజిబిలిటీ: పదోతరగతి లేదా ఐటీఐ లేదా ఎన్​సీవీటీ మంజూరు చేసిన నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి. (బి) జీపీ–1900/ 2000 ఉన్న పోస్టులకు 12వ తరగతి లేదా సమానమైన అర్హత  ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 25.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్​లకు రూ.250. ఇతరులకు రూ.500. 

లాస్ట్ డేట్: నవంబర్ 14.

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ ట్రయల్స్​లో కనబర్చిన ప్రతిభ, క్రీడల్లో సాధించిన పతకాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు scr.indianrailways.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies