Type Here to Get Search Results !

Sports Ad

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సిఐడి విచారణకు హాజరైన హీరో విజయ్ దేవరకొండ Hero Vijay Deverakonda attends CID hearing in betting app promotion case

Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : బెట్టింగ్ యాప్ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లకు తెలంగాణ CID అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ మంగళవారం (2025 నవంబర్ 11న) మధ్యహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ ఇద్దరికి ఆదేశాలు జారీ చేశారు. 

 ఈ మేరకు హీరో విజయ్ దేవరకొండ బషీర్ బాగ్ లోని CID కార్యాలయంలో విచారణకు హాజరు అయ్యారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద వారిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్ లపై అరా తియ్యనున్నారు CID అధికారులు. చట్టవిరుద్ధమైన యాప్ లకు ప్రమోషన్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అనే కోణంలో కూడా CID విచారించి వీరి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయనుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies