Type Here to Get Search Results !

Sports Ad

ఆధ్యాత్మికం చంద్రగ్రహణం(మార్చి3) గర్భిణీలు వృద్దుల చిన్న పిల్లలు పాటించాల్సిన నియమాలు ఇవే ఎప్పటి వరకు అన్నం తినొచ్చు Spiritual Lunar Eclipse (March 3) These are the rules to be followed by pregnant women, the elderly, and young children. Until when can rice be eaten?

భారత్ ప్రతినిధి : ఖగోళ శాస్త్రవేత్తలు పండితులు జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 3 వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది.  ఈ సయమంలో గ్రహణ దోష నివారణ పూజలు జపాలు చేయాలని పండితులు చెబుతున్నారు.  చంద్రగ్రహణ దోషనివారణ నియమ నిబంధనలతో గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్దులు ఏ సమయం వరకు ఆహారం తీసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

 ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు  చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరుగుతుంటాడు. 

 జ్యోతిష్య నిపుణులు తెలిపిన ప్రకారం   సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది.  సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు  దగ్గర గాని, కేతువు దగ్గర గాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.పూర్తిగా చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ, కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.  మార్చి 3 వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగా చివరి 27 నిమిషాలు  కనపడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 మార్చి 3న పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజున మధ్యాహ్నం  3:21గంటలకి మొదలై  సాయంత్రం 6:48 గంటల వరకు  చంద్రగ్రహణం ఉంటుంది.  పూర్వఫల్గుణి (పుబ్బ)నక్షత్ర్లంలో సింహ రాశిలో  కేతు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణము ఏర్పడనుంది.  గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు  మొత్తం గ్రహణ సమయం3 గంటల 27 నిమిషాలు.

 మార్చి 3న  న ఏర్పడే చంద్ర  గ్రహణం సింహ రాశిలో పూర్వ ఫల్గుణి ( పుబ్బ)  నక్షత్రంలో  ఏర్పడుతుంది. కావున సింహ, కర్కాటక, మకర, కుంభ రాశులకు చెందిన  వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.  అందువలన  ఈ  రాశుల వారు  ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితిలో చూడకూడదు.  చంద్రగ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

 మేషం, మీనం, ధనుస్సు, వృశ్చికం, కన్య, కుంభం, కర్కాటక, మకర రాశులపై కూడా ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ రాశుల వారు గ్రహణ శాంతులు చేయించుకోవడం ఉత్తమం.మిగతా రాశుల వారు నియమాలను పాటిస్తే  మంచిదని చెబుతున్నారు. 

చంద్రగ్రహణ నిబంధనలు.... 
 చంద్రగ్రహణ సమయంలో గ్రహణ నియమాలు, శాంతులు, ఆలయాల మూసివేత వంటివి హిందూ దర్మ శాస్త్రాల ప్రకారం  ఆచరించాలి. ఇక సనాతన ధర్మం ఆచరించేవారు, గృహస్థాశ్రమ నియమాలు పాటించే వాళ్లు మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనం వంటి కార్యక్రమాలు ముగించితే మంచిదంటున్నారు.  గర్భిణి స్త్రీలు, వృద్దులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు గ్రహణానికి అరగంట ముందు వరకు  తినవచ్చని పండితులు చెబుతున్నారు.

* ఈచంద్ర గ్రహణాన్ని గర్భిణి  స్త్రీలు  చూడ కూడదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భగవంతుడిని  ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.  కావున ప్రశాంతంగా  కదలకుండా పడుకోవాలి.

* గర్భిణీ స్త్రీలు, వృద్ధులు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో చంద్రకాంతిని నేరుగా తాకకూడదు. దీని కోసం తలుపులు, కిటికీలను మూసి ఉంచడం మంచిదని భావిస్తారు.

* గ్రహణ సమయంలో మల, మూత్ర విసర్జనలకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు.

* ప్రతి ఒక్కరు  గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి.

* ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు, జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.

* గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.

* గ్రహణానికి ముందు తయారు చేసిన  అన్నం కూరలు  తినుటకు పనికి రావు.

* గ్రహణ సమయంలో నిలువ ఉన్న ఆహర పదార్ధాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా క్రమేణ  శరీరానికి హాని కలిగిస్తాయని శాస్త్రాలు, పెద్దలు చెబుతుంటారు.

 గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్దతిని ఆచరించాలి.   శారీరక శక్తి, నమ్మకాలు  ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు, తర్వాత పట్టు, విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భగవన్నామ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్థాయిలో ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఆధ్యాత్మిక నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న   నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies