Type Here to Get Search Results !

Sports Ad

రేపే (ఏప్రిల్ 29) పదో తరగతి ఫలితాలు విడుదల Class 10 results to be released tomorrow (April 29)

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : టెన్త్ విద్యార్థులకు, పేరెంట్స్ కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10వ తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ విద్యాశాఖ. 2026 ఏప్రిల్ 29న ( బుధవారం ) ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. మధ్యాహ్నం 2 గంటలకు SCERT  ఫలితాలు విడుదల చేయనున్నారు. 

 మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 23 నాటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. 

అధికారిక వెబ్ సైట్: https://bse.telangana.gov.in/ లో ఫలితాలను చూడవచ్చు. 

 టెన్త్ రిజల్ట్స్ ముందుగా మే ఫస్ట్ వీక్ లో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ మూల్యాంకనం వేగవంతంగా పూర్తి కావడంతో ఏప్రిల్ 29 రిలీజ్ చేసేందుకు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ముఖ్య​అతిథిగా హాజరై ఫలితాలను విడదల చేయనున్నట్లు చెబుతున్నారు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంతో ఆలస్యం అయితే ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న రిజల్ట్స్ వెలువడుతాయని చెబుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies