తాండూరు భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డ్రైనేజీపై అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం తొలగించారు. బస్టాండ్ కాంపౌండ్ వాల్‌కు ఆనుకుని ఉన్న ఈ నిర్మాణాలను పోలీసుల సమక్షంలో జేసీబీతో కూల్చివేశారు. అయితే, ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టడంపై చిరు వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
బస్టాండ్ ఆవరణలో ఆక్రమణల తొలగింపు Removal of encroachments in the bus stand premises
April 18, 2026
0





