Type Here to Get Search Results !

Sports Ad

ఐఫోన్, మ్యాక్‌బుక్ కొనలేకపోతున్నారా ఆపిల్ నుంచి సూపర్ ఆఫర్ ఇకపై అద్దెకు తీసుకోవచ్చు Can't afford an iPhone or MacBook? Here’s a super offer from Apple—you can now rent them.

భారత్ ప్రతినిధి : ఆపిల్ ప్రొడక్ట్స్ ఇష్టపడే వారికోసం  ఆపిల్ కంపెనీ ఒక  కొత్త అద్భుతమైన సర్వీస్ పరిచయం చేసింది. ఐఫోన్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్ లేదా ఆపిల్ వాచ్‌లను ఒకేసారి  డబ్బులు పెట్టి కొనలేని వారి కోసం 'ఆపిల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్' పేరుతో ఒక లీజింగ్ (rent) విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త ప్రోగ్రామ్ ఏంటో చూద్దామా.

1. ఈ కొత్త ప్రోగ్రామ్ ఏంటంటే 
డబ్బులు కట్టి కొనడానికి బదులుగా, ప్రజలు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆపిల్ డివైజెస్‌ను అద్దెకు తీసుకోవచ్చు. ఆది కుడా  ప్రతినెలా  ఈఎంఐ/లీజు పద్ధతిలో. మీరు తీసుకునే ఐఫోన్‌లు, ఆపిల్ వాచ్‌లు 12 లేదా 24 నెలల లీజు ఆప్షన్‌తో లభిస్తాయి. అదే మ్యాక్‌లు, ఐప్యాడ్‌లైతే 24 లేదా 36 నెలల  వరకు లీజు ఆప్షన్‌తో తీసుకోవచ్చు.

 ఐఫోన్‌కు అయితే నెలకు $17.99, ఆపిల్ వాచ్‌కు అయితే $11.99, ఐప్యాడ్‌కు అయితే  $11.99, మ్యాక్‌కు అయితే  $24.99 నుండి ఈ ప్రతినెలా ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. 

2. లీజు గడువు తరువాత 
ఈ లీజు గడువు పూర్తయిన తర్వాత కస్టమర్లు మూడు రకాల ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు.
1. కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ అవ్వవచ్చు.
2. చివరి ఈఎంఐ పేమెంట్  చేసి ఆపిల్ డివైజ్ పూర్తిగా సొంతం చేసుకోవచ్చు లేదా ఆ డివైజ్ వెనక్కి ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ నుండి బయటికి రావచ్చు.

3. అదనపు ప్రయోజనాలు & నియమాలు
ఈ ప్రోగ్రామ్ 'క్లార్నా' సంస్థ సహకారంతో పనిచేస్తుంది. దీనికోసం చిన్న అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో సాఫ్ట్ క్రెడిట్ చెక్ మాత్రమే చేస్తారు కాబట్టి క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడదు.

ట్రేడ్-ఇన్ & ఆపిల్ కార్డ్: పాత ఆపిల్ డివైజ్ ఇచ్చేసి (ట్రేడ్-ఇన్) ప్రతినెలా పేమెంట్  మరింత తగ్గించుకోవచ్చు. ఆపిల్ కార్డ్‌తో చెల్లించే వారికి 3% డైలీ క్యాష్ కూడా లభిస్తుంది.

 ఈ సరికొత్త సర్వీస్ ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే అమెరికాలో పాత పద్ధతిలో ఉన్న ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను ఆపిల్ నిలిపివేసింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies