Type Here to Get Search Results !

Sports Ad

రైతులను దగా చేస్తున్న బిజెపి ప్రభుత్వం

 



రైతులను మోసం చేస్తున్న బిజెపి ప్రభుత్వం 

  • రైతులకు అండగా ఉంటామన్న టిఆర్ఎస్ పార్టీ 
  • రైతు ధర్నాలో పలుకొన్న ఎమ్యల్యే పైలట్ రోహిత్ రెడ్డి ,ఎమ్యల్సీ మహేందర్ రెడ్డి 
  • ఆయా మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్ర‌జా ప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు

తాండూర్ :
 తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్య మంత్రి కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి అధ్వర్యంలో తాండూర్ పట్టణం లో  ఇందిరా చౌక్ దగ్గర  రైతు మహా ధర్నా నిర్వహించారు.ఈ  సందర్బంగా  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,ఎమ్యల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సివుంది కానీ నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం పై భారం మోతున్నారు. రైతులకు అనేక విధాలుగా మోసాలు చేస్తున్నారు అని తెలిపారు.తెలంగాణ రైతులకు అండగా ఉంటామన్నారు.రైతుల కోసం రైతు బంధు,రైతు బీమా అమలు చేశామన్నారు.కేంద్రం ప్రభుత్వం కొనుకోలు చేసే వరకు ఉద్యమం చేస్తామన్నారు. 




అనంతరం ట్రాక్టర్ల ద్వారా దిష్టి బొమ్మలను తీసుకువచ్చారు బషీరాబాద్ మండల నాయకులు శవయాత్ర చేస్తూ ధర్నా వద్దకు చేరుకున్నారు.ఈ యొక్క సమావేశంలో తాండూర్ నియోజకవర్గంలోని ఆయా మండల పార్టీ నేతలు బషీరాబాద్,యాలాల,పెద్దేముల్ మండల నుండి బారి ఎత్తున ధర్నాలో పలుకొన్నారు. ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కలసి కేంద్ర ప్ర‌భుత్వ నాయకుల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ,అమిత్ షా,బండి సంజయ్ గారి శ‌వ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.




కేంద్ర ప్ర‌భుత్వ నాయకుల శ‌వ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం 

ఈ యొక్క ధర్నా కార్యక్రమాలలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్,వైస్ చైర్ పర్సన్ దీపా ,మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తమ్ రావు,మాజీ చైర్మన్ విశ్వనాధ్ గౌడ్,జిల్లా పశుగణ అభివృద్ధి  సంస్థ నారాయణ రెడ్డి,జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్,ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), మాజీ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్‌, తాండూరు మండ‌ల పార్టీ అధ్య‌క్షులు రాందాస్, పెద్దేముల్ అధ్య‌క్షులు కె.శ్రీ‌నివాస్ యాద‌వ్, బ‌షీరాబాద్ మండ‌ల అధ్య‌క్షులు రాములు నాయ‌క్, యాలాల మండ‌ల అధ్య‌క్షులు మ‌ల్లారెడ్డి,యాలాల ఎంపీపీ బాలేశ్వ‌ర్ గుప్త‌, టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తంరావు, మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు డాక్ట‌ర్ సంప‌త్ కుమార్, పీఏసీఎస్ చైర్మ‌న్లు వెంక‌ట్రామ్ రెడ్డి, ద్యావ‌రి విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి,  రాజుగౌడ్,  తాండూరు మున్సిప‌ల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడ‌ర్ శోభారాణి, కౌన్సిల‌ర్లు అబ్దుల్ ర‌జాక్, మంకాల రాఘ‌వేంద‌ర్, రాము, నాయ‌కులు అబ్దుల్ స‌లీం, చంటియాద‌వ్, సంతోష్ గౌడ్, సంజీవ‌రావు, రాజన్ గౌడ్, ఇంతియాజ్, మోయిజ్, రియాజ్,ఏకమై యువ నాయకులు గంగాధర్  ఆయా  ప్రాంతాల ప్ర‌జా ప్ర‌తినిధులు, టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు ఈ యొక్క ద‌ర్నాలో పాల్గొన్నారు.



ఎమ్యల్యే గూడేల మైపాల్ రెడ్డి  రైతుల మద్దతుగా ద‌ర్నా

హైదరాబాద్ :  వరి రైతుల మద్దతుగా,వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వెళ్తున్న రామేశ్వరం బాండ గ్రామ సర్పంచ్ ఎ.ధరణి అంతి రెడ్డి ఉపసర్పంచ్ మరియు వార్డు నెంబర్లు, గ్రామ కమిటీ టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.గోపాల్ మరియు గ్రామ యువకులు రైతుల సమక్షంలో గుమ్మడి దళ హైవే పైన ధర్నా చేస్తున్న పఠాన్ చేరు మండల  టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్యల్యే గూడేల మైపాల్ రెడ్డి అద్వర్యంలో ధర్నానిర్వహించారు. ఎమ్యల్యే గూడేల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సివుంది కానీ నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం పై భారం మోతున్నారు. రైతులకు అనేక విధాలుగా మోసాలు చేస్తున్నారు అని తెలిపారు.తెలంగాణ రైతులకు అండగా ఉంటామన్నారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమాలలో టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు ఈ యొక్క ద‌ర్నాలో పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies