బషీరాబాద్ లో అసాధారణ సర్వసభ సమావేశం
- సర్వసభ సమావేశం మండల అభివృద్ధి కోసం
- హాజరైన వివిధ శాఖా అధికారులు
- మండల అభివృద్ధి పనులకు ప్రతి ఒకరు సహకరించాలి మరియు ఐక్యంగా ఉండాలి
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రం లో సాధారణ సర్వసభ సమావేశం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కరెంటు ఏఈ పనితీరు పై బషీరాబాద్ మండల్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు కరెంటు సమస్య పై ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవని, ఎందుకు డ్యూటీ చేస్తున్నావంటూ తీవ్ర స్థాయిలో పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు శుక్రవారం ఎంపీపీ కరుణ అజయప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.వార్డు సబ్యులకు ఉన్న విలువ మాకు లేదంటూ సర్వసభ్య సమావేశంలో మండల ఎంపిటిసిలు మండిపడ్డారు.ప్రతి మూడు నెలలకు ఒక సరి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖలకు సంబందించిన అధికారులు వారి యొక్క పనుల నిమిత్తం తదితర విషయాల పై వివరాలు తెలియజేసారు.కొన్ని పనుల విషయాలపై అధికారులు గ్రామంలో జెరుగుతున్న పనుల గని సమావేశాలు నిర్వహించినపుడు మండల ఎంపీటీసీకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చేప్పిన పనులు కూడా చెయ్యడం లేదని ఎంపీటీసీ లు శ్రీధర్,వడ్డే శ్రీనివాస్,రాజు అధికారుల పై మండి పడ్డారు. ఈ సమావేశంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ గారు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన గ్రామ కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి సమాచారం అందచేసి ప్రారంభించాలని,మండల అభివృద్ధి పనులు ప్రతి ఒకరు సహకరించాలని తెలిపారు.అలాగే కరోనా వాక్సిన్ విషయంలో కూడా ప్రతి ఒకరు తీసుకునేలా సహకరించాలి.అందరము ఐక్యంగా ఉంటేనే గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతాయి అన్నారు. ఈ యొక్క కార్యక్రమాలలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్,జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీపీ జడల అన్నపూర్ణ,పిఎసిఎస్ చైర్మన్ వెంకట రాంరెడ్డి,ఎంపీడీఓ రమేష్,ఎంఆర్ఓ వెంకట్ స్వామి,ఆర్ డబ్ల్యూ ఏఈ వంశీ కృష్ణ,సర్పంచ్లు,ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,వివిధ శాఖా అధికారులు,తదితరులు పలుకొన్నారు.