- వికారాబాద్ జిల్లా కల్కోడా గ్రామం సమీపంలో
- కాళ్ళు,చేతులు విరిగి ఇద్దరి పరిస్థితి విషమంగా
- అది వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు
వికారాబాద్ : అతివేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిధి లో చోటుచేసుకుంది. సంగారెడ్డి డిపో కు చెందిన ఆర్టిసి బస్సు సంగారెడ్డి నుంచి తాండూర్ కి వెళుతుండగా మర్పల్లి మండలం కల్కోడా గ్రామం సమీపంలో మూల మలుపు దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది.బస్సుకు ఒక భాగం నొకేసినట్లు అణిగి పోయింది. కొంత మంది బస్సులో ఇరుక పోయి కాళ్ళు,చేతులు విరిగి తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు చాల బాధలో ఉన్నారు. ఆ సమయంలో బస్సు నిండా ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.సుమారుగా 40 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. డ్రైవర్ అది వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అందులో ప్రయాణించే ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఆయా డిపో లలో అద్దెకు తీసుకున్న బస్సులే ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయని డ్రైవర్లు నిర్లక్ష్యంగా వేగంగా బస్సులు నడపడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది.