ఉపసర్పంచ్ గోవిందప్ప పై దాడి చెసిన సర్పంచ్
- దళిత ఉపసర్పంచ్ గోవిందప్ప ను కులం పేరుతో దుశించి దాడి చేసిన వారి ని వెంటనే అరెస్ట్ చేయాలి
- కెవిపిఎస్ దళిత ప్రజాసంఘాల డిమాండ్
ఈ సందర్బంగా కెవిపిఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ తాండూర్ మండలం మీట బాసుపల్లి గ్రామం లో దళిత ఉపసర్పంచ్ గోవిందప్ప గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మాణం చేయడం ఆపివేయాలని గ్రామ రచ్చ కట్ట ముందల సర్పంచ్ గారిని ప్రశ్నించి నందుకు అతని పై వెంబడి పడీ,దాడి చేసి కులం పేరుతూ దుశించిన వారి పై ఎస్సి,ఎస్టీ కేసు నమోదు అయి 30 రోజుల గడిచిన కూడా అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలి అని సర్పంచ్ పట్లోళ్ల నరేందర్ రెడ్డి మరియు అతని అనుచరులు దళిత ఉపసర్పంచ్ అయినేందుకు కుల దూరహంకారం తో కక్ష గట్టి దళితుడు నాకు పేరు పెట్టి పిలవడం ఏమిటని దౌర్జన్యం చేసి కులం పేరుతో దుశించి దాడి చేసిన నింది తులని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. లేనిచో కెవిపిఎస్ మరియు దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తానని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో బాధితుడు ఉపసర్పంచ్ గోవిందప్ప, మరియు కెవిపిఎస్ తాండూర్ మండల నాయకులు జైపాల్, గ్రామస్తులు పెంటప్ప, అనంతప్ప తదితరులు పాల్గొన్నారు.
చెంగోల్ గ్రామంలో 131వ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి
సమాజంలో వెనుకబడిన వర్గాల, కులాల, మహిళల అభ్యునతికి, చేసిన కృషికి ఆయనను మహాత్మా అనే బిరుదు ఇచ్చుకున్నారు. సామాజిక తత్వవేత్త, సమన్యాయ శోధకుడు భారత దేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన మహనీయుడు. సమసమాజ స్థాపన కోసం పరితపించే వ్యక్తి అందరూ సమానమే అని పూణేలో తొలిబాలికల పాఠశాలను 1848 నెలకొల్పాడు.1855లో2 పాఠశాలలను ఏర్పాటు చేశాడు. ఆనాడు సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు విద్య నేర్చుకొని ఇతర రంగాలలో అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదు అని చాలా గట్టిగా అభిప్రాయపడ్డాడు. మనమందరము మహాత్మా జ్యోతిబా పూలే వారసులంగా ఆయన ఆశయాలను నెరవేర్చే కొందాం అని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాలలో అంబేద్కర్ యువజన నాయకులు గ్రామస్తులు పాల్కొన్నారు.