మైల్వార్ పాము కాటుకు బలి అయిన జగమ్మ
బషీరాబాద్ : పాము కాటు వేసి ఒక మహిళా మృతి చెందిన. ఘటన బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామం లో జగమ్మ భర్త పేరు శమప్ప. గురువారం రోజు వరి చేనికి వెళ్లి పని అంత ముగించుకొని,కొంత గడ్డి కలుస్తుండగా అకస్మాత్తుగా పాము వచ్చి కాటు వేసింది.అనంతరం దగ్గరలో ఉన్న నీలాపల్లి గ్రామనికి తరలించారు.నాట్టు వైద్యం వల్లే పాము కాటు వేస్తె రాత్రి అంత మేల్కొని ఉండాలి కాబట్టి రాత్రి అంత మేల్కొని జగమ్మ కు అండగా ఉండి ధైర్యపరిచారు.కానీ ఫలితం లేకపోయింది మరుసటి రోజు వైద్యం కోసం శుక్రవారం రోజున మద్దూర్ గ్రామానికి వెళ్లి అక్కడ కూడా వాళ్ల చేసే ప్రయత్నాలు అన్ని చేసారు. కానీ ఫలితలం శూన్యం మిగిలిచింది.చివరికి పాము కాటుకు జగమ్మ ప్రాణం విడిచింది.
జీవన్గిలో హనుమాన్ మందిరానికి భూమి పూజ
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం పరిధిలో జీవన్గి గ్రామంలో ఎమ్యల్యే పైలట్ రోహిత్ రెడ్డి హనుమాన్ మందిరానికి భూమి పూజ చేశారు . గ్రామ శివారులో నూతనంగా హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికి గ్రామస్తులు నిర్వహించారు.ఎమ్యల్యే రోహిత్ రెడ్డి ని ఆహ్హానించడంతో జీవన్గి గ్రామం లో ప్రజలంత ఆనందం హనుమాన్ మందిరాన్ని పూజ కార్యక్రమాలు ఎమ్యల్యే చేతుల మీదుగా భూమి పూజ చేసారు. ఎమ్యల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో హనుమాన్ మందిరాన్ని నిర్మించడం మంచిదని తన వంతు సహాయం చేస్తానని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమాలలో టిఆర్ఎస్ నాయకులు శ్రీ శైలం రెడ్డి,నర్సి రెడ్డి,మహేందర్ రెడ్డి,సత్తయ్య,మాణిక్య రెడ్డి,వీరా రెడ్డి,రాములు,గ్రామ పెద్దలు,గ్రామస్థులు తదితరులు పలుకొన్నారు.