రైతు కుటుంబానికి సహాయం అందజేసిన అధికారులు
బషీరాబాద్ : రైతు కుటుంబానికి సహాయం అందజేసిన నవాంద్గి సహకార సంఘం బషీరాబాద్ మండలం ఏకమై గ్రామానికి చెందిన కన్నె మొగులప్ప కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు అకస్మాత్తుగా శుక్రవారం రోజు మరణించడంతో ఈ యొక్క విషయం తెలుసుకున్న జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులు చైర్మన్ మనోహర్ రెడ్డి సహకార సంఘంలో సభ్యుడిగా ఉండి ఎవరైనా మరణిస్తే సంఘం తరుపున సహాయం అందించాలని తెలిపారు.మృతి చెందిన కన్నె మొగులప్ప కుటుంబానికి రూ.9000/- వేల రూపాయలు సహకార సంఘం తరుపున చైర్మన్ వెంకట్రాం రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ యొక్క కార్యక్రమాలలో పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి ,వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ,సర్పంచ్ నారాయణ,డైరెక్టర్ గోపాల్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,సీఈఓ వెంకటయ్య,కుటుంబ సభ్యులు తదితరులు పలుకొన్నారు.
మైల్వార్ గ్రామంలో మెగా పార్క్ ఏర్పాటు
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో మెగా పార్క్ లో రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ పరిశీలించారు.మెగా పార్క్ ఏర్పాటు కోసం గ్రామ సర్పంచ్ సీమాసుల్తానా మరియు ఎంపీపీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ సర్వే నెంబర్ 235,ప్రభుత్వ భూమిలో 10 ఎకరాల స్థలని పరిశీలించి పనులను ప్రారంభించారు.మండల అధికారులు ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ మెగా పార్క్ నిర్మాణం పనులు వేగవంతంగా జరగాలని,అతి త్వరలో పూర్తి చేసి ఆదర్శ వంతమైన పార్క్గా ఏర్పాటు చేయాలన్నారు.ఈ యొక్క కార్యక్రమాలలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్,పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,మాజీ ఎంపీపీ ఖాలిద్,సర్పంచ్,టిఆర్ఎస్ నాయకుడు బిచ్చిరెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.