శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత
- శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి 17500 నగదు
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీపూర్ గ్రామంలో మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ తన వంతు గా రూపాయలు 17500 నగదును అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని మరియు పూజలు చేయాలనీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, బషీరాబాద్ మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, పూజారి అంజిలప్ప పంతులు తదితరులు ఉన్నారు.
రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 15 తేదీన మహా పాడిపూజా
తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇట్టి మహా పాడిపూజా కార్యక్రమం ఈ నెల డిసెంబర్ 15 వ (15/12/2021) తారీఖు బుధవారం సాయంత్రం సమయం 5:30పీఎం గంటలకు తాండూర్ పట్టణం లోని జూనియర్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేసారు.ఈ యొక్క కార్యక్రమనికి తాండూరు నియోజకవర్గం పరిధిలోని గురు స్వాముల, అయ్యప్ప స్వామి మాలదరులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆశీర్వదించబడాలని మరియు అయ్యప్ప స్వామి దీవెనలు పొందాలని తెలిపారు.ఈ యొక్క పూజ కార్యక్రమానికి అందురు ఆహ్వానితులే అని అన్నారు.