ఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన MLA
- నలుగురు లబ్ధదారులకు రూ.4 లక్షల 35వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేత
డబుల్ బెడ్ రూం ఇండ్లపై ప్రత్యేక దృష్టి
- మూడు నెలల్లో అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు
- ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేలా కృషి
తాండూరు : తాండూరు పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎమ్మెల్యే ఖంజాపూర్ గేట్ సమీపంలో డబుల్ బెడ్రూం నిర్మాణ పనులను పరిశీలించారు.అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ప్రతి పేదవాడు రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో దర్జాగా కాలుమీద కాలేసుకుని బతకాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. త్వరలోనే అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పునరుద్ఘాంటించారు.ఈ కార్యక్రమాలలో తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్కొన్నారు.
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన MLA
తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఖంజాపూర్ గేట్ సమీపంలో ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.అక్కడ నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నరు. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారి సహకారంతో విద్యార్థుల కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాఠశాల బయట విద్యుత్ దీపాలు లేవని విద్యార్థుల తెలపగా వెంటనే మున్సిపల్ అధికారులను అక్కడ లైట్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించడం వారిని అభినందించి సన్మానించారు.