బషీరాబాద్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం లో నేడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అయన నేర్పిన బాటలో మనమందరం నడవాలని బషీరాబాద్ మండలం నాయకులు ఆ మహోన్నతమైన వ్యక్తిని కొనియాడారు.ఈ యొక్క సమావేశంలో మండల అధ్యక్షులు రాములు,టీఆరెస్ సీనియర్ నాయకులు రాజ రత్నం,తాహెర్ బాండ్,చవాన్ నరేష్,యువజన యువకులు తదితరులు పలుకొన్నారు.
ఇందార్చెడ్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
బషీరాబాద్ మండలంలో ఇందార్చెడ్ గ్రామంలో నేడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అయన నేర్పిన బాటలో మనమందరం నడవాలని బషీరాబాద్ మండలం నాయకులు ఆ మహోన్నతమైన వ్యక్తిని కొనియాడారు.ఈ యొక్క సమావేశంలో ఉప సర్పంచ్ ఎల్లప్ప,అంబేద్కర్ యువజన సంఘ యువకులు,గ్రామస్తులు,తదితరులు పలుకొన్నారు.పర్వత్ పల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
బషీరాబాద్ మండలంలో పర్వత్ పల్లి గ్రామంలో నేడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అయన నేర్పిన బాటలో మనమందరం నడవాలని బషీరాబాద్ మండలం నాయకులు ఆ మహోన్నతమైన వ్యక్తిని కొనియాడారు.ఈ యొక్క సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ ఎం.నర్సింహ,సర్పంచ్ పిర్మ బేగం, అంబేద్కర్ యువజన సంఘ యువకులు,గ్రామస్తులు,తదితరులు పలుకొన్నారు.
ఎమ్మార్పియస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి
తాండూర్ : ఎమ్మార్పియస్, యమ్ యస్ పి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు పి.ఆనంద్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్బంగా ఎమ్మార్పియస్ యమ్ యస్ పి జిల్లా సీనియర్ నాయకులు పి. ఆనంద్ కుమార్ మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడమే లక్ష్యంగా ఎమ్మార్పియస్ మరియు యమ్ యస్ పి పనిచేస్తుంది అని అన్నారు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు అన్ని దేశాల రాజ్యాంగలను పరిశీలించి రాత్రింబవాళ్ళు కస్టపడి మన దేశానికి సరిపోయే విదంగా రాజ్యాంగాన్ని వ్రాసి ఇచ్చారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేవిధంగా అన్ని కులాలలోని మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించారు సమానత్వం కోసం అనేక ఉద్యమాలు చేశారు అంబేద్కర్ గారి కారణంగానే అన్ని కులాల ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం ఎస్సి ఎస్టీ బిసి మైనారిటీ బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరు కృషి చేయాలనీ కోరారు ఈ కార్యక్రమం లో ఎమ్మార్పియస్ యాలల మండల ఇంచార్జి ఎం. నర్సిములు, మరియు సీనియర్ నాయకులు వై. వెంకటేష్, బాలరాజ్, వెంకటేష్, మాణిక్యం మహేందర్,సురేందర్ విజయ్ తదితర ఎమ్మార్పియస్ నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద ఆసిఫ్ గారు మాట్లాడుతూ, భారతదేశం ఎన్నో కుల, మతాలు ఒకే చోట ఉండే దేశం కాబట్టి, వీరి మధ్య ఎటువంటి తారతమ్యాలు లేని, అందరికీ సమన్యాయం, కులమతాలకతీతంగా అందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టం,సమాన హక్కులు ఉండేవిధంగా అంబేద్కర్ గారు ఆ రోజు, రాజ్యాంగాన్ని రచించడంలో కీలకపాత్ర పోషించి, ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందజేశారు.ఈరోజు ఎంతోమంది విభిన్న ఆచార, వ్యవహారాలతో కూడా, ఈ ప్రజాస్వామ్యం భారతదేశంలో పూర్తి హక్కును కలిగి, ఎటువంటి ఒత్తిడి లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు అంటే, అది అంబేద్కర్ గారి ముందుచూపు గొప్పతనం అని చెప్పక తప్పదు.ఈరోజు సమాజంలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటే, వారు కల్పించిన హక్కు, చట్టం, అందుకు కారణం.అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా, అంటరాని వాళ్లని ఈ సమాజంలో ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్న వారికి ఇతరులతో సమానంగా జీవించే, హక్కు, అంబేద్కర్.గారు.కల్పించారు.ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలని ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తున్న సంగతి ఈ దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది, ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి, ఈ పవిత్ర రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అని, మరి ఒకసారి అంబేద్కర్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నామని వారు తెలిపారు.