Type Here to Get Search Results !

Sports Ad

ఉపాధ్యాయుడు రత్నం పై అక్రమ కేసును ఎత్తివేయాలి


 ఉపాధ్యాయుడు రత్నం పై అక్రమ కేసును ఎత్తివేయాలి

- దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం 
- విద్యార్థులు కలిసి మెలిసి ఉండే విధంగా రత్నం బోధించేవారు
 - పసి హృదయాల్లో కలతలు రేపే విధంగా కొంతమంది కుల వ్యవస్థను పెంచారు
- కక్షగట్టిన స్థానిక అగ్రవర్ణాలు అధికారులను 

బషీరాబాద్ : బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు రత్నం పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వికారాబాద్ లోని అంబేద్కర్ భవన్ లో దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ మైల్వార్ పాఠశాలలో పసి హృదయాల్లో కలతలు రేపే విధంగా కొంతమంది కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే అక్కడి విద్యార్థులు చాతుర్వర్ణ ఆధారిత పుట్టుకల గురించి చర్చించారని అన్నారు. ఉపాధ్యాయుడు అర్థం ఈ కులాల ప్రస్తావన తప్పు అని అందరూ కలిసి మెలిసి ఉండాలని సదరు విద్యార్థులకు చెప్పడాన్ని అక్కడి అగ్రవర్ణాలు తప్పుబట్టాయి అని అన్నారు. 

మధ్యాహ్న భోజనం చిన్న సందర్భంలోనూ, ఇతర సందర్భాల్లో కూడా విద్యార్థులు కలిసి మెలిసి ఉండే విధంగా రత్నం బోధించేవారు అని  తెలిపారు. విద్యార్థుల్లో సమానత్వాన్ని బోధిస్తున్నాడు అని ఇది మనువాద వ్యతిరేక చర్యని గమనించి  రత్నం పై కక్ష కట్టారు అన్నారు. కుల వివక్ష ఉండకూడదు, మనుషులందరూ సమానమే అని రాజ్యాంగం చెబుతుంటే ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది దీనిని సహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. ఆధునిక కాలంలో కూడా ఇంకా కుల వ్యవస్థ గురించి విద్యార్థులకు బోధించడం అజ్ఞానం అన్నారు. కాబట్టి రత్నం ను ఏ విధంగా అయినా అడ్డుకోవాలని కక్షగట్టిన స్థానిక అగ్రవర్ణాలు అధికారులను తప్పుదోవ పట్టించి మత ప్రచారకుడు అంటూ అతని పై ముద్ర వేసి అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. ఈ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ప్రభుత్వ ఉపాధ్యాయుడైన రత్నం ఉద్యోగంలో ఉన్న సమయంలో అతనిని కులంతో దూషించి దాడికి యత్నించిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అధికారుల మెడలు వంచి రత్నంకు న్యాయం జరిగే వరకూ పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం, ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ పిల్లికండ్ల ఆనంద్ మాదిగ, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.నర్సింహులు, భారత నాస్తిక సమాజం నారాయణపేట జిల్లా అధ్యక్షులు చిన్నికృష్ణ, బీఎస్పీ బంటారం మండల ప్రధాన కార్యదర్శి హెచ్.విజయ్ కుమార్, వికారాబాద్ మండల నాయకులు బొక్కి యాదయ్య, ఎన్.యాదయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కొడంగల్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి గౌరగల్ల కృష్ణ మౌర్య, గండీడ్ మండల్ అధ్యక్షుడు బోరు కృష్ణయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి బి.వెంకటేశ్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 మైల్వార్ కు 11న నిజ నిర్ధారణ కమిటీ

రత్నం పై కేసు పెట్టడం పూర్తిగా కుట్రపూరితమని ఈ విషయమై నిజనిర్ధారణ చేయాలని ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఇందుకుగాను ఈనెల 11వ తేదీన నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు ఖరారు చేశారు. ఈ కమిటీకి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ పిల్లికండ్ల ఆనంద్ మాదిగ, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.నర్సింహులు, భారత నాస్తిక సమాజం నారాయణపేట జిల్లా అధ్యక్షులు చిన్నికృష్ణ, బీఎస్పీ బంటారం మండల ప్రధాన కార్యదర్శి హెచ్.విజయ్ కుమార్, వికారాబాద్ మండల నాయకులు బొక్కి యాదయ్య, ఎన్.యాదయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కొడంగల్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి గౌరగల్ల కృష్ణ మౌర్య, గండీడ్ మండల్ అధ్యక్షుడు బోరు కృష్ణయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి బి.వెంకటేశ్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ లు కమిటీ సభ్యులుగా నిజనిర్ధారణ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies