ఘనంగా జరిగిన రైతు బంధు సంబరాలు
తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో రైతు బంధు
సంబరాలు ఘనంగా జరిగాయి.ఎడ్ల బండి మరియు ట్రాక్టర్ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే
పైలెట్ రోహిత్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా
ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎడ్ల బండ్లు, భారీగా ట్రాక్టర్ లతో ఘన స్వాగతం పలికారు
రైతులు, నాయకులు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు అంటూ రైతన్నలు నినదించారు.తాండూరు విలియమున్ స్కూల్ గ్రౌండ్ నుండి ర్యాలీ నిర్వహించారు.
తాండూరు ప్రధాన
రహదారిలో ర్యాలీ ధూమ్ ధాంగా సాగింది. అనంతరం రైతు బజార్ లో ఏర్పాటు చేసిన
సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయం కోసం రైతులకు
ఉచితంగా 24 గంటల కరంట్
అందజేస్తున్నారు.తెలంగాణా సమైక్య పాలనలో 22 లక్షలున్న బోరు మోటార్లు,గత ఏడేళ్లలో 8 లక్షలు పెరిగయి.ప్రస్తుతం
30 లక్షల బోరు మోటార్లకు
చేరుకున్నాయి. అన్ని మోటార్లకు ఉచితంగా కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
అన్నారు. రైతులు పంట పెట్టుబడులకు ఇబ్బంది పడొద్దని రైతుబంధు ద్వారా సహాయం అందజేస్తునారని
పేర్కొన్నారు.
రైతు శ్రేయస్సు కోరి వారి కోసం రైతుభీమా, సాగునీటి వసతి, అందుబాటులో
ఎరువులు, విత్తనాలు, 24 గంటల ఉచిత కరంటు
అందిస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన, పథకాలకు
ఎలాంటి ఆటంకాలు రానివలేదని,
వ్యవసాయ
సంక్షోభానికి రైతుబంధు పథకం దారితెన్నూ చూపిందని వారు అన్నారు.ఈ యొక్క
కార్యక్రమాలలో మంత్రులు ,సీనియర్ నాయకులు,ఎంపిటిసిలు,జెడ్పిటిసిలు,ఆయ గ్రామాల,మండల నాయకులు తదితరులు పలుకొన్నారు.