- ముఖ్య అతిథిగా హాజరైనా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
- ప్రజలకు అధికారులకు వారధిగా ప్రజాబంధు యాప్
- ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే యాప్ ఉద్దేశం
- అధికారులకు, ప్రజలకు సమన్వయంగా ప్రజాబంధు కోఆర్డినేటర్లు
- దుర్గా గ్రాండ్యుర్ లో ప్రజాబంధు యాప్ పై అధికారులకు అవగాహన సదస్సు
తాండూర్ : తాండూర్ నియోజకవర్గంలో ప్రజలకు బంధువై నిలచిన ఎమ్మెల్యే. ప్రజలకు అధికారులకు ప్రజాబంధు యాప్ వారధిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండ్యుర్ లో ప్రజాబంధు ఆ పై అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాబంధు సమన్వయకర్త రామ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరైయ్యారు. ప్రజాబంధు యాప్ పనితీరు ఆయన అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ కార్య్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు హాజరై మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం నిమిత్తం ఎంతో మంది ప్రజలు నన్ను కలవడానికి వస్తుంటారని వారికి ఇబ్బంది కలగకుండా వారి సమస్యల పరిష్కారం చూపెందుకు ప్రజాబంధు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. అధికారులకు ప్రజలకు వారధిగా ప్రజాబంధు యాప్ నిలుస్తుందని అన్నారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్న ఈ యొక్క ఆప్ ద్వారా తెలియజేయడం ద్వారా సంబంధిత అధికారులు స్పందించాలని తెలిపారు.
తాండూరు నియోజకవర్గ పరిధిలో మండలాల వారీగా క్లస్టర్ లో ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్ కు కోఆర్డినేటర్ లను నియమించినట్లు తెలిపారు. ఈ కోఆర్డినేటర్లు అధికారులకు ప్రజలకు సమన్వయంగా పని చేస్తారని అన్నారు. త్వరలో ప్రజల ముందుకు ఈ ఆప్ ని తీసుకురానునట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ యొక్క కార్యక్రమాలలో మండల వారిగా అధికారులు,ప్రజలు,తదితరులు పలుకొన్నారు.