తాండూరులో బిజెపి
పార్టీకి మరో షాక్
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో
- టిఆర్ఎస్ పార్టీలో చేరిన బిజెపి కౌన్సిలర్ సంగీతా ఠాకూర్
తాండూరు : తాండూరు పట్టణం అభివృద్ధిలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారితో కలిసి నడిచేందుకు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు సంగీతా ఠాకూర్ వెల్లడి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆమెతో పాటు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న బీజేపీ నాయకులు.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారితో పాటు మునిసిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, నియోజకవర్గ అధికార ప్రతినిధి రాజు గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నయిము అఫ్ఫు, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్, నర్సింలు, శ్రీనివాస్ చారి, పట్టణ పార్టీ కార్యదర్శి సంతోష్ గౌడ్, రవి, కౌన్సిలర్స్ సిందుజా గౌడ్, ఏర్రం వసంతా తదితరులు ఈరోజు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారిని కలిశారు.