అంబేద్కర్ విగ్రహనికి
సహాయం చేస్తా ఎమ్మెల్యే
తాండూర్ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రేగొండి గ్రామ ఉప సర్పంచ్ శివ గారు మరియు 20 మంది రేగొండి గ్రామ యువకులు తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారిని కలిసి గ్రామంలో ఉన్న సమస్యలను విన్నవించగా ఎంతో ఆప్యాయతతో పలకరించి మీకు ఏ సమస్య వచ్చినా నా ద్రుష్టికి తీసుకురండి.
ఎంత పెద్ద సమస్య అయిన కచ్చితంగా తీరుస్తానని అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ గారు యువకులకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ఏ సమస్యనైనా వెంటనే మా ద్రుష్టికి తీసుకు వస్తున్నారని చెప్పారు. అలాగే రేగొండి గ్రామానికి అంబేద్కర్ విగ్రహం కావాలని అడిగితే మీరు ఎప్పుడంటే అప్పుడు విగ్రహాన్ని పంపిస్తానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు చెప్పారు.యువకులు సంతోషం వ్యక్తం చేశారు.





