ప్రజల సమస్యలు తీర్చాలి BSSM సిబ్బంది
భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏవో గారికి మూడు మండలాలకు సంబంధించిన పిటిషన్ లు ఇచ్చిన BSSM తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు మరియు టీమ్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలు మంచినీటి సదుపాయం,కరెంటు సదుపాయం,రోడ్డు నిర్మాణం ఇందిరమ్మ టైంలో కట్టినటువంటి ఇల్లు,మట్టితో కట్టినటువంటి పెంకుటిల్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్న అధికారులు స్పందించట్లేదని,పాల్వంచ మండలంలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీ ఉలువనూరు బంజర మరియు 8 గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణం కరెంటు సదుపాయం పోడు భూములకు పట్టాలు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని.
దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో గల భూదాన భూములు 6000 ఎకరాలపై పూర్తి సర్వే నిర్వహించి 2001 నుంచి 2012 వరకు పోరాటంలో పాల్గొని జైలు పాలై అనేక ఇబ్బందులకు గురైన నిజమైన బాధితులకి సర్వే చేసి భూదాన భూములు పట్టా హక్కులు కల్పించి పట్టా భూములు అప్పచెప్పాలని,ఈ మూడు మండలాలకు సంబంధించిన దానిమీద ఈరోజు ఏవో గారిని కలవడం జరిగింది. స్పందించిన ఏవో గారు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.అదే విధంగా BSSM తరపున గతంలో జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన పిటిషన్ కి స్పందించి ప్రజా సమస్యలపై ఐటీడీఏ పిఓ గారికి లేఖ రాసినందుకు గిరిజన, బహుజనుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ ఊకే భవాని, వజ్జ సీత, బానోత్ జ్యోతి, మాలోత్ మాంగినీ, రమేష్, NHRACAC స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కండే చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.