ధారూర్ జాతరకు వెళుతున్నఆర్టీసీ బస్సు బోల్తా
* ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా
* హాస్పిటల్ కు తరలించిన చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
* అక్కడిక్కడే ఓ మహిళా మృతి
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా క్రైస్తవ మెథడిస్ట్ జాతరకు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన వికారాబాద్ పట్టణంలో అనంతగిరి గుట్ట నందిగాట్ మూలమలుపు వద్ద చేటు చేసుకున్నది.వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ధారూర్ మండల సమీపంలో జరుగుతున్న క్రైస్తవ మెథడిస్ట్ జాతరకు వెళుతున్న సమయంలో అనంతగిరి గుట్ట కింద ప్రమాదవశాత్తు బస్సు బోళ్తా పడటంతో ఓ మహిళా మృతి చెందింది.
72 మంది ప్రయాణికులతో వికారాబాద్ నుండి ధారూర్ జాతరకు వెళుతున్న బస్సు.ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స కోసం,పలు వాహనాల్లో వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వెళ్లి అరా తీశారు.బ్రేకులు పేలు కావడం వల్లే ప్రమాదం జరిగిందంటున్న బస్ కండక్టర్.అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, ధైర్యంగా ఉండాలని వారికి మనోధైర్యం ఇచ్చారు.ఎమ్మెల్యే గారు హాస్పిటల్ సూపర్డెంట్ తో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు.