నవాంద్గి గ్రామంలో కళాబృందం
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశం మేరకు బషీరాబాద్ మండల ఎస్ఐ శనివారం రోజున సాయంత్రం బషీరాబాద్ మండలం నవాంద్గి గ్రామంలో పోలీసు కళ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో బషీరాబాద్ ఎస్ఐ Vidhya Charan Reddy ముఖ్య అతిథిగా పాల్గోని ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు.సమాజములో జరుగుతున్న నేరాలు వాటినుండి ఎలా జాగ్రత్తగా ఉండాలి, సైబర్ నేరాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.వాటితో పాటు డయల్ 100, బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నిర్మూలన సమస్యలపై పాటలు ద్వార అవగాహన కల్పించారు.ఈ యొక్క కార్యక్రమములో పోలీసుల కళా బృందం మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్కొన్నారు.