Type Here to Get Search Results !

Sports Ad

తాండూర్ లో ఎమ్మెల్యే సంబరాలు...బీజేపీ నాయకులు వేట కుక్కలు

బీజేపీ నాయకులు వేట కుక్కలు..తాండూర్ లో ఎమ్మెల్యే సంబరాలు 

* ప్రజనాయకుడు పైలెట్ కు ఘనస్వాగతం
* జనం జైజైలతో నీరాజనాలు
* అట్టహాసంగా ఎమ్మెల్యే స్వాగత ర్యాలీ
* విల్యేమూన్ చౌరస్తా నుండి వినాయక చౌక్ మీదుగా భద్రప్ప గుడి వరకు సాగిన రోడ్-షో
* ఇసుకెస్త్యే రాలనంతా జనంతో కిక్కిరిసిన భద్రేశ్వర దేవాలయ ప్రాంగణం
* ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 
* పాల్కొన్న నాయకులు అభిమానులు 

తాండూర్ : ప్రతి క్షేణం ప్రజల కోసం నీతి నిజాయితీగా అందరికి అండగా ఉండే ప్రజనాయకుడు పైలెట్ కు ఘనస్వాగతం పలికిన తాండూర్ ప్రజలు.ఎమ్మెల్యేల ఎర వ్వవహారంలో చాకచక్యంగా వ్యవహరించి తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడి కేసీఆర్ గారి మాన్నేనలు పొంది నియోజకవర్గ అభివృద్ధికి అధికశాతం నిధులు మంజూరు చేయించి తాండూరుకి విచ్చేసిన మన తాండూరు ముద్దు బిడ్డ ఎమ్మెల్యే రెడ్డి.ఎమ్మెల్యేల ఎర వ్వవహారంలో తరువాత తాండూర్ వచ్చిన ఎమ్మెల్యేను స్వాగతం పలికారు.బీజేపీ ప్రభుత్వం దేశానికి పట్టిన శాపం ఆ శాపం తెలంగాణ రాష్ట్రానికి పట్ట వద్దని కోరారు.భద్రేశ్వర దేవాలయ ప్రాంగణంలో సభ వేదికలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న కుట్ర బట్ట బయలు చేసారు.

మాట్లాడుతున్నా పైలట్ రోహిత్ రెడ్డి 

తెలంగాణ పై కేంద్రం ఓర్వలేని తనంతో ఇలాంటి కుట్రలు చేస్తున్నారని,వందల కోట్లు ఇస్తామన్న కేంద్రం పదవులు ఇస్తాం అని ఎరవేశారు.ఢిల్లీ వేట కుక్కలు దేశంలో ఇప్పటి వరకు 9 రాష్ట్రాలను కొనుగోలు చేశారు అదే విధంగా తెలంగాణను కూడా కొనుగోలు చేద్దామని ప్రయత్నిస్తుంటే చెంచెల్ గూడ జైల్లో చిప్పకూడు దిక్కయింది అని తెలిపారు.బీఆర్ఎస్ తో బంగారు భారత దేశం భావిష్యత్ లో భారత దేశం నెంబర్ 1 స్థానంలో ఉండగలదని తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కె దకిందన్నారు.బీఆర్స్ తరుపున కేసీఆర్ గారిని ప్రధాని అయితే భారత దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుపుతారు.ఇందుకు ప్రజలందరూ ఆదరించాలని కోరారు.


పైలట్ రోహిత్ రెడ్డికి బహ్మ రథం

భద్రేశ్వర దేవాలయ ప్రాంగణంలో తెరాస పార్టీ అధ్యక్షులు అప్పు(నయుమ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి నేతలు,అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.రాజీవ్ కాలనీ నుండి భద్రేశ్వర దేవాలయ ప్రాంగణం వరకు చేపట్టిన ర్యాలీలో పైలట్ రోహిత్ రెడ్డికి పూవ్వుల వర్షం కురిపించారు.పైలట్ రోహిత్ రెడ్డికి బహ్మ రథం చేపట్టారు.మహిళా సంఘాలతో ఘన స్వాగతం పలికారు.

ప్రాణం ఉనంత వరకు ప్రజలకు అండగా 

తాండూర్ మునిసిపల్ లోని ప్రతి వార్డుకు కోటి రూపాయలతో,మరియు గ్రామీణ ప్రాంతాలకు ఒక్క గ్రామానికి 50 లక్షల నిధుల చొప్పున కేటాయిస్తున్నట్లు,తాండూర్ లో విద్య రంగం వ్యవస్థ అభివృద్ధి కొరకు 3 కోట్లు,బషీరాబాద్ మండలానికి జూనియర్ కళాశాల మంజూరు కాబోతుంది.కోట్ పల్లి,శవ నగర్ ప్రాజెక్ట్ అభివృధి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాలలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు రాజు గౌడ్,మునిసిపల్ వైస్ చైర్మన్ దీపనర్సింలు,పట్టణ పార్టీ అధ్యక్షుడు అప్పు నయుమ్,రాములు నాయక్,రాందాస్,మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు విట్టల్ నాయక్,కోట్ పల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉప్పరి మహేందర్,శ్రీనివాస్,రవీందర్ రెడ్డి,సర్పంచులు,ఎంపిటిసిలు,మండల నాయకులు,యువకులు,అభిమానులు భారీ ఎత్తున ప్రజలు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies