అంబేద్కర్ అందరివాడు సునీతారెడ్డి
వికారాబాద్ : అంబేద్కర్ పై అభిమానంతో,ప్రేమతో వికారాబాద్ పట్టణంలో మయూర్ అనే వ్యక్తి ప్రతిరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేస్తున్నాడు.సోమవారం రోజుతో 365 రోజులు అవుతుంది.ఇట్టి కార్యక్రమానికి సునితమ్మ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.సాల్వ పువ్వుమాలతో సన్మానించారు.జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి మాట్లాడుతూ రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివారని అన్నారు.
ఆయన చూపిన బాటలో అందరూ నడుచుకోవాలన్నారు.జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉన్నత స్థాయికి ఎదిగాడో ప్రతి ఒక్కరు మహానుభావుడిని ఆదర్శనంగా తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్,మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్,ఎంపీపీ చంద్రకళ కమల్ రెడ్డి,టీఆర్ఎస్ యువనాయకుడు వడ్ల నందు,నవాబ్ పేట్ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ గౌస్,నాయకులు జైపాల్ రెడ్డి,నవాబ్ పేట్ అశోక్,టైగర్ కృష్ణయ్య,న్యాయవాదులు పెండ్యాల ఆనంతయ్య,అవుటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జడ్పి నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
వికారాబాద్ జిల్లాలలో నిర్మిస్తున్న నూతన జడ్పి భవన పనులను జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి పరిశీలించారు.నిర్మాణ పనులను వేగవంతం చేయాలని,పనుల్లో నాణ్యత తగ్గొద్దని ఇంజినీర్లకు ఆదేశించారు.కార్యక్రమంలో జడ్పి సీఈఓ జానకీ రెడ్డి,డిప్యూటీ సీఈఓ శుభాషిణి,పీఆర్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
బాధలో ఉన్నవారిని ఓదార్చాలి
బంట్వారం మండల రొంపల్లి ఎంపీటీసీ శ్రీకాంత్ రెడ్డి తండ్రిని వికారాబాద్ లోని వారి నివాసంలో పరామర్శించిన జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి.అలాగే మొమిన్ పేట్ మండలం దుర్గం చేరువు టీఆర్ఎస్ నాయకుడు మల్లయ్య భార్యను అనారోగ్యంతో బాధ పడుతుంటే ఆమెను కూడా ఇంటికి వెళ్లి మాట్లాడారు.జడ్పి చైర్ పర్సన్ తో వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ ఉన్నారు.