మండల అధికారుల పై మండి పడ్డ బిఆర్ఎస్ పార్టీ
యాలాల : సోమవారం రోజున వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో అసహనం వ్యక్తపరిచిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు.ప్రోటోకాల్ పాటించని అధికారులు.మండల క్లస్టర్ ఇంచార్జ్ లకు కూడా సమాచారం ఇవ్వని అధికారులు.ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీటీసీలకు సర్పంచులకు కూడా కనీస సమాచారం లేదు.ఇది అధికారుల నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందే దిశలో ముందుకు సాగుతున్న తరుణంలో ఇలాంటి అధికారుల వలన ప్రజలకు కనీస సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో ఎంపీటీసీలు,సర్పంచులు,అధికార ప్రతినిధులు.
ఇలాంటి అధికారులను అడ్డం పెట్టుకొని పార్టీ యొక్క శ్రేణులను,అభిమానులను అయోమయం చేసే పనిలో కొంతమంది నాయకులు.గౌరవ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారు ప్రతి మండలానికి ప్రతి గ్రామ పంచాయతీకి ఎన్నో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పథంలో తాండూర్ నియోజకవర్గాన్ని నిలబెడతారని సగర్వంగా చెప్పడం జరిగింది.ఇది యావత్తు తాండూర్ నియోజకవర్గం నమ్ముతుంది అది కొద్ది మంది నాయకులకు అర్థం కానట్లుంది అని మండి పడ్డారు.
యాలాల్ కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
గౌరవ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సోమవారం రోజున యాలాల మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా యాలాల మండల ఎంపీపీ శ్రీ బాలేష్ గుప్తా పాల్కొన్నారు.పౌర సరఫరా సంస్థ వికారాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో కాగ్న జల రైతు ఉత్పత్తి దారుల సంస్థ లి వారి సౌజన్యంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రము ప్రారంభం చేశారు.ప్రతి ఒక రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా కోఆప్షన్ మెంబర్ అధ్యక్షులు అక్బర్ బాబా,ఎంపీటీసీలు సర్పంచులు అలాగే బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,గ్రామ ప్రజలు పాల్కొన్నారు.
హాజీపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం
హాజీపూర్ గ్రామంలో సర్పంచ్ శీను ఆధ్వర్యంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాలాల మండల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,మరియు వికారాబాద్ జిల్లా కో ఆప్షన్ మెంబర్ అధ్యక్షులు అక్బర్ బాబా గారిని సన్మానించారు.పిఎసిఎస్ వైస్ చైర్మన్ వడ్డె రాములు గారు,మాజీ ఎఎంసి డైరెక్టర్ కృష్ణకుమార్,పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,లాలూ ముదిరాజు,బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.